https://oktelugu.com/

JP Nadda Nitin: మొన్న ఎన్టీఆర్.. నేడు నితిన్.. తెలుగు హీరోలతో బిజెపి నేతల వరుస భేటీల కథేంటి?

JP Nadda Nitin: బీజేపీ పెద్దలు ఏదో స్కెచ్ గీస్తున్నారు. రాజకీయ పర్యటనలకు వచ్చి తెలుగు హీరోలను కలుస్తున్నారు? ఇందులో రాజకీయం ఉందా? లేక మీడియా ఫోకస్ కావడానికి చేస్తున్నారా? సమ్ థింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతోందన్న వాదన అయితే వినిపిస్తోంది. మొన్న జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటి అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణలోని మునుగోడు సభకు వచ్చిన ఆయన హైదరాబాద్ లో రాత్రి ఎన్టీఆర్ తోపాటు ఈనాడు రామోజీరావును కలిసి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2022 / 09:58 PM IST
    Follow us on

    JP Nadda Nitin: బీజేపీ పెద్దలు ఏదో స్కెచ్ గీస్తున్నారు. రాజకీయ పర్యటనలకు వచ్చి తెలుగు హీరోలను కలుస్తున్నారు? ఇందులో రాజకీయం ఉందా? లేక మీడియా ఫోకస్ కావడానికి చేస్తున్నారా? సమ్ థింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతోందన్న వాదన అయితే వినిపిస్తోంది.

    మొన్న జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటి అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణలోని మునుగోడు సభకు వచ్చిన ఆయన హైదరాబాద్ లో రాత్రి ఎన్టీఆర్ తోపాటు ఈనాడు రామోజీరావును కలిసి చర్చలు జరిపారు. ఏం జరిగిందన్నది ఎవరూ బయటకు చెప్పలేదు. కానీ దీనివెనుక పెద్ద రాజకీయమే ఉందని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ లో నటన బాగుందని ఎన్టీఆర్ ను కలిశానని అమిత్ షా అంటున్నా అందులో నటించిన రాంచరణ్ ను కలవకపోవడంతో ఈ అనుమానాలకు ఆస్కారమిచ్చినట్టైంది.

    ఇక పోతే రేపు వరంగల్ లో బీజేపీ తలపెట్టిన బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. ఈ సభకు హైకోర్టుకు ఎక్కి మరీ అనుమతి తీసుకొచ్చుకుంది బీజేపీ. ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

    ఈ క్రమంలోనే రేపు హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు.శంషాబాద్ ఎయిర్ పోర్టులో నడ్డాను కలుసుకునేందుకు హీరో నితిన్ వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మొన్న ఎన్టీఆర్ తో మాట్లాడిన బీజేపీ పెద్దలు.. ఈరోజు నితిన్ కలవడంలో ఆంతర్యం ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు.

    తెలుగు హీరోలతో బీజేపీ నేతల వరుసభేటిలు చర్చనీయాంశమవుతున్నాయి. మొన్న జూనియర్ ఎన్టీఆర్ , నేడు నితిన్ లను కలవబోతుండడం హాట్ టాపిక్ గా మారింది. దీనివెనుక ఖచ్చితంగా సినిమాల గురించి ఏం లేదని.. వారిని రాజకీయంగా ఉపయోగించుకునే ఎత్తుగడ మాత్రమే ఉందంటున్నారు. పెద్దగా క్రేజ్ లేని యంగ్ హీరో నితిన్ తో బీజేపీ పెద్దలకు ఏం పని అన్నది ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్నారు. చూస్తుంటే తెలంగాణలో బీజేపీ సరికొత్త యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.