బీజేపీ అసలు టార్గెట్ అదేనా

అది గుజరాత్‌ రాష్ట్రం. అక్కడెక్కడో టీ స్టాల్‌ నడుపుకునే వ్యక్తికి ఆ రాష్ట్రం రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు దేశానికే ప్రధానమంత్రి అయ్యారు. ఆయనే భారత ప్రధాని మోడీ. వన్‌మన్‌ షోతో దేశాన్ని, బీజేపీని నడిపిస్తున్న అధినేత. తిరుగులేని.. ఎదురులేని మహానేత. అలాంటి వ్యక్తికి ఓ బలమైన కోరిక ఉందట. అదే.. దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని. Also Read: వైరల్: ఈ ఒక్క దెబ్బతో అందరి నోళ్లు […]

Written By: NARESH, Updated On : November 19, 2020 10:05 am
Follow us on


అది గుజరాత్‌ రాష్ట్రం. అక్కడెక్కడో టీ స్టాల్‌ నడుపుకునే వ్యక్తికి ఆ రాష్ట్రం రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు దేశానికే ప్రధానమంత్రి అయ్యారు. ఆయనే భారత ప్రధాని మోడీ. వన్‌మన్‌ షోతో దేశాన్ని, బీజేపీని నడిపిస్తున్న అధినేత. తిరుగులేని.. ఎదురులేని మహానేత. అలాంటి వ్యక్తికి ఓ బలమైన కోరిక ఉందట. అదే.. దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని.

Also Read: వైరల్: ఈ ఒక్క దెబ్బతో అందరి నోళ్లు మూయించిన రఘునందన్ రావు

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మోడీకి సాటి ఎవరూ లేరు. తాజాగా బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలు కూడా అవే రుజువు చేశాయి. అందులోనూ ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ లో విజయకేతనం ఎగురవేసింది. ఇక సౌత్‌లో చూసుకుంటే కర్ణాటకలో బీజేపీ పట్టు బాగానే కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో దుబ్బాక బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. దాంతో బీజేపీ శిబిరంలో జోష్ హైపీచ్‌లో ఉంది.

జమిలీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీలో ఎప్పటినుంచో ఉన్న ఆలోచన. బీజేపీ ప్రజాస్వామ్యం కంటే ఏకస్వామ్యాన్నే గట్టిగా నమ్ముతుంటుంది. ఒకే దేశం, ఒకే మతం, ఒకే పార్టీ, ఒక్కడే నాయకుడు ఇలాంటి ఒకటి అంటే బీజేపీకి ఎంతో మోజు. నిజానికి ఇది ఆర్ఎస్ఎస్ భావజాలం. ఆర్ఎస్ఎస్ రాజకీయ స్వరూపం అయిన బీజేపీ ద్వారానే వీటిని సాకారం చేయాలనుకుంటున్నారు. తొలిసారి వాజ్ పేయి వంటి ఉదార వాది ప్రధాని కావడంతో నాడు ఆర్ఎస్ఎస్ అజెండాను బయటకు రానివ్వలేదు. ఇప్పుడు మోడీ రూపంలో తమ కోరికల చిట్టా బయటకు తీసి వరుసగా నెరవేర్చుకుంటోంది.

Also Read: తమిళ ‘ఫ్యామిలీ’ పాలిటిక్స్ లో బీజేపీ చిచ్చు!

అయితే.. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అని అనుకున్నట్లు ఈ పరిస్థితుల్లోనూ బీజేపీ తన సత్తాను మరోసారి చూపాలని చూస్తోంది. అందుకే 2022లో జమిలీ ఎన్నికలకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దేశంలో రాజకీయ వాతావరణం సానుకూలంగా ఉన్న వేళ అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు కలుపుకుని ఒకేసారి ఎన్నికలకు వెళ్లి మళ్లీ మోడీని ప్రధానిగా నిలబెట్టాలని ఆర్‌‌ఎస్ఎస్‌ అజెండా. మరోవైపు తెలుగు రాష్ట్రాలనూ టార్గెట్‌ చేసిన బీజేపీ.. అక్కడా పాగా వేయాలని చూస్తోంది. తెలంగాణలో ఇప్పటికే దుబ్బాక ఫలితంతో బీజేపీ అంటే ఏంటో నిరూపించింది. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నా ఇన్నాళ్లు దీటైన పార్టీ లేకనే జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ లోటు భర్తీకి బీజేపీ రెడీగా ఉంది. దీంతో కేంద్రం కూడా తెలంగాణపై భారీ ఆశలు పెంచుకుంది. ఇక ఏపీలో జగన్ మీద మోజు తగ్గిందా లేక‌ అలాగే ఉందా అన్న దానికి కొలమానం తిరుపతి ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ రెండూ చూసుకుని ఏపీలో రాజకీయ అవసరాలు, అవకాశాలు బీజేపీ బేరీజు వేసుకుంటుందని అంటున్నారు. మొత్తంగా 2021లో బీజేపీ దూకుడు ఇలాగే సాగితే 2022 జమిలీ ఎన్నికలు జరగడం ఖాయమనే తెలుస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్