BJP: ఒకప్పటి లాగా కాకుండా ప్రజెంట్ చాలా విషయాల్లో మార్పులు వచ్చిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే అందరూ ఆ పరిస్థితులకు అనుగుణంగా మారిపోతున్నారు. ఒకవేళ అలా మారనట్లయితే వాళ్లు ఔట్ డేటెడ్ అయిపోతుంటారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు కూడా చాలా ముందుంటాయి. ముందున్నాయి కూడా.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సోషల్ మీడియా ప్రజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ప్రచారంలో బీజేపీ కింగ్‌గా ఉంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ సోషల్ మీడియాకు వాట్సాప్ యూనివర్సిటీ అని పేర్లు పెట్టారు కొందరు. అయితే, బీజేపీకి అలా వాట్సాప్ యూనివర్సిటీ అని పేరు రావడానికి గల కారణమేమిటనేది చాలా మందికి అర్థం కాలేదు. కాగా, ఇటీవల కాలంల బీజేపీ సైబర్ తెలివి తేటలు వెలుగులోకి వస్తున్నాయి.
పెగాసస్ వ్యవహారం దేశంలో చర్చనీయాంశంమైంది. ఈ క్రమంలోనే బీజేపీ సోషల్ మీడియా వింగ్‌లో కొంత కాలం పని చేసి బయటకు వచ్చిన ఓ యువతి.. సంచలన విషయాలు బయట పెట్టింది. బీజేపీ వారు యూజ్ చేస్తున్న టెక్ ఫాగ్ యాప్ గురించి తెలిపింది. ఈ ‘టెక్ ఫాగ్’ యాప్‌తో బీజేపీపై విమర్శలు చేస్తున్న వారిని నియంత్రిస్తారని, వారి అభిప్రాయాలను తారు మారు చేస్తారని, ఎన్ క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ ఫారాలలోకి చొచ్చుకుపోయి అభిప్రాయాలను తారుమారు చేస్తారని ఆరోపించింది.
ఈ ‘టెక్ ఫాగ్’ యాప్ సొంతంగా ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ క్రియేట్ చేయడంతో పాటు ఆటోమేటిక్‌గా షేర్ కూడా చేస్తుంది. అలా బీజేపీపైన ఆర్తి శర్మ అనే ఆ పార్టీ ఐటీ సెల్ లో పని చేసిన యువతి సంచలన ఆరోపణలు చేసింది. టెక్ ఫాగ్ ను బీజేపీ ఏ విధంగా దుర్వినియోగం చేసిందో చెప్పింది. ఈ టెక్ ఫాగ్ దుర్వినియోగంపై విచారణ జరిపించాలని ఎడిటర్స్ గోల్డ్ సుప్రీం కోర్టుకు లేఖ రాసింది. ఈ విషయమై బీజేపీ అయితే ఇంకా అధికారికంగా స్పందించ లేదు. కేంద్రం ఈ విషయమై ఎటువంటి ప్రకటన ఇంకా చేయలేదు.
[…] […]
[…] […]