2022 UP Assembly Elections: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కాకపోతే విశేషమేమిటంటే అన్ని పార్టీల్లో మహిళలే ప్రధానంగా ఉన్నారు. రాష్ర్టంలోని ప్రధాన పార్టీల అధినేతలంతా మహిళా నేతలే కావడం గమనార్హం. పార్టీలను తమ చేత్తో అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలో రాజకీయాలను శాసించేందుకు తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు.
బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ముఖ్యమంత్రిగా మూడుసార్లు శాసించినా ప్రస్తుతం మళ్లీ యూపీలో అధికారంలోకి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రాతో కలిసి రాష్ర్టంలో బీఎస్పీని అధికారంలోకి తీసుకొచ్చే పనుల్లో నిమగ్నమయ్యారు. పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టాలని అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. దీంతో రాజకీయ వేడి ప్రారంభమైంది. ఎన్నికల వాతావరణం సంచలనంగా మారుతున్నాయి.
Also Read: పంజాబ్ లో సీఎం అభ్యర్థి ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణకు రెడీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూతురుగా పేరున్న ప్రియాంక గాంధీ. రాష్ర్టంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాష్ర్టంలో మహిళలకు 40 శాతం సీట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. లక్నోలోనే నివాసం ఉంటూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ప్రియాంక రాకత కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతోంది. దీంతో విజయం సాధించి తీరుతామని చెబుతున్నారు.
బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అప్నా దళ్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్ కూడా రాష్ర్టంలో బీజేపీని మరోసారి అధికారంలో కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఎన్డీయే మిత్రపక్షంగా 2014లో మీర్జాపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 11 స్థానాల్లో పోటీ చేసి తొమ్మిది మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. అనుప్రియా పటేల్ పార్టీ ఎన్డీఏ కు పూర్తి మెజార్టీ తీసుకురావడానికి సాయపడింది.
Also Read: బీజేపీయే ‘వాట్సాప్ యూనివర్సిటీ’ సృష్టికర్త.. ‘టెక్ ఫాగ్’తో సోషల్ మీడియాలో కింగ్..?