https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. బిజెపి పెద్దల టాస్క్ అదే!

బిజెపికి ఇన్నాళ్లకు స్టార్ క్యాంపైనర్ దొరికారు జనసేన అధినేత పవన్ రూపంలో. నిన్నటి మహారాష్ట్ర విజయంలో భాగం పంచుకున్నారు పవన్. అందుకే కీలకమైన దేశ రాజధానిలో జనసేన అధినేతను ప్రయోగించడానికి బిజెపి అగ్ర నేతలు సిద్ధమయ్యారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 25, 2024 / 01:55 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan : మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని మహా యూటీ కూటమి ఘన విజయం సాధించింది.ఇక్కడ బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గాను 122 స్థానాల్లో విజయం సాధించింది.కమలం పార్టీ అభ్యర్థులు విజయభేరీ మోగించారు. 59 సీట్లతో ఏక్ నాథ్ షిండే శివసేన రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రను 15 నెలల పాటు పరిపాలించిన కాంగ్రెస్, ఎన్సీపీలు వరుసగా మూడు నాలుగు స్థానాలకు పరిమితం అయ్యాయి. జార్ఖండ్లో మాత్రం బిజెపికి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో ఉన్న బిజెపి తదుపరి ఢిల్లీ అసెంబ్లీపై దృష్టి పెట్టనుంది.అయితే తొలిసారిగా మహారాష్ట్రలో జనసేన అధినేతతో ప్రచారం చేయించింది బిజెపి. పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాలతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బిజెపి హవా నడిచింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పవన్ సేవలను ఉపయోగించుకోవాలని చూస్తోంది బిజెపి హై కమాండ్. అందుకు పవన్ సైతం సుముఖంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే అమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే. ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ అన్ని విధాలా సిద్ధంగా ఉంది. తన అరెస్టుతో బిజెపికి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఆ ఉత్సాహంతోనే 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బిజెపి నేతలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అక్కడ కూడా పవన్ సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

    * వచ్చే ఏడాది ప్రారంభంలోనే
    వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బిజెపితో పాటు ఆప్ కు కూడా ప్రతిష్టాత్మకం. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. 2015లో 67, 2020లో 62 స్థానాలతో ఆప్ తిరుగులేని విజయం సాధించింది.ఈసారి 60కి పైగా స్థానాలను గెలిచే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఆప్ ఉంది. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం లేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఆప్ నాలుగు చోట్ల,కాంగ్రెస్ మూడు చోట్ల కలిసి పోటీ చేశాయి. కానీ ఏడు స్థానాల్లో కూడా అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అందుకే ఇప్పుడు వేరువేరుగా ఆ రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి.

    * బిజెపిని వెంటాడుతున్న సానుభూతి భయం
    ఢిల్లీ లిక్కర్ స్కాం లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సైతం అరెస్టు చేశారు. ఈ తరుణంలో సానుభూతిగా పనిచేస్తుందని బిజెపి భయపడుతుంది. మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వాగ్దాటికి నిలిచే నాయకుడు లేకుండా పోయాడు. ఇటువంటి తరుణంలో జనసేన అధినేత పవన్ అయితే గట్టిగా సమాధానం ఇవ్వగలరని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. మహారాష్ట్రలో పవన్ సభలు సక్సెస్ అయిన తరుణంలో.. దేశ రాజధానిలో సైతం పవన్ ప్రభావం చూపుతారని ఆశిస్తున్నారు. అందుకే బిజెపి స్టార్ క్యాంపెయినర్గా పవన్ ను తీసుకొచ్చేందుకు బిజెపి పెద్దలు మానసికంగా సిద్ధపడినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.