కొడాలి నానికి బీజేపీ షాక్.. మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు..?

వైసీపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైన సంగతి విదితమే. ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నిన్న విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలు సరికావని.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. Also Read : అచ్చెన్నాయుడికి జ్ఞానోదయం […]

Written By: Navya, Updated On : September 22, 2020 1:54 pm
Follow us on

వైసీపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైన సంగతి విదితమే. ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నిన్న విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలు సరికావని.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

Also Read : అచ్చెన్నాయుడికి జ్ఞానోదయం కలిగిందా..?

హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఆంజనేయ స్వామి గురించి కొడాలి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. రాజకీయ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని.. కేంద్రం కొత్త చట్టం ద్వారా నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా చర్యలు చేపట్టనుందని పేర్కొన్నారు. నేతలు శాసనసభ గౌరవం, ప్రతిష్టకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తే పార్టీ అధినేతలు నియంత్రించాలని సోము వీర్రాజు తెలిపారు.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తిరుమలకు వచ్చిన సమయంలో డిక్లరేషన్ పై సంతకం పెట్టారని… అన్య మతస్తులు ఎవరైనా తిరుమలకు వస్తే డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొన్నారు. విజయవాడ మాచవరంలొని దాసాంజనేయ స్వామికి కొడాలి నానికి హిందూ దేవతలను, హిందూ మతాన్ని గౌరవించే విధంగా మంచి బుద్ధిని ప్రసాదించాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం సోము వీర్రాజు కొడాలి నానిపై మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

“డిక్లరేషన్ ఇవ్వకపోతే గుడి అపవిత్రమవుతుందా..? అపచారం జరుగుతుందా..? వెండి సింహాల విలువ 6 లక్షలు కూడా ఉండదని.. ప్రభుత్వం అంతర్వేదిలో తగలబడిన రథానికి బదులుగా కొత్త రథాన్ని నిర్మిస్తుంది” అని కొడాలి హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడారని సోము వీర్రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను చూస్తూ ఊరుకోబోమని అన్నారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయన మంత్రి నానిపై ఫిర్యాదు చేశారు.

Also Read : తొలి టీకాకు బ్రాండ్ అంబాసిడర్ భారతీయ మహారాణులే..!