https://oktelugu.com/

AP-Telangana Politics: విశాఖపై బీజేపీ ఫోకస్.. తెరవెనుక రాజకీయం ఏంటి?

AP-Telangana Politics: భారతీయ జనతా పార్టీ దక్షిణాది స్టేట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరాదిలో పట్టున్న పార్టీ కావడంతో దక్షిణాదిపై కూడా ఓ కన్ను వేసింది. ఇప్పటికే తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీ ఆంధ్రపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తన బలం పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందుకు గాను తన ఎంపీలను విశాఖకు పంపుతోంది. ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలంటే ఎంపీలతో రాయబారం చేస్తోంది. అధిష్టానం ఆదేశాలను ఎంపీలు పాటిస్తూ విశాఖలో పర్యటిస్తూ బీజేపీని అధికారంలోకి […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 10, 2022 / 11:25 AM IST
    Follow us on

    AP-Telangana Politics: భారతీయ జనతా పార్టీ దక్షిణాది స్టేట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరాదిలో పట్టున్న పార్టీ కావడంతో దక్షిణాదిపై కూడా ఓ కన్ను వేసింది. ఇప్పటికే తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీ ఆంధ్రపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తన బలం పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందుకు గాను తన ఎంపీలను విశాఖకు పంపుతోంది. ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలంటే ఎంపీలతో రాయబారం చేస్తోంది. అధిష్టానం ఆదేశాలను ఎంపీలు పాటిస్తూ విశాఖలో పర్యటిస్తూ బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని భావిస్తోంది.

    AP-Telangana Politics

    ఇన్నాళ్లు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోయినా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీని ఎదుర్కోవాలని సిద్ధమవుతోంది. దీనికి పార్టీ ఎంపీలను వాడుకోవాలని చూస్తోంది. పార్టీకి రాజ్యసభ సభ్యులుండటంతో వారితో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వరుసగా జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, సీఎం రమేష్ లు విశాఖలో పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాలను హైలెట్ చేయాలని చూస్తున్నారు. దీంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కూడా తన ప్రభావం చూపాలని భావిస్తున్నట్లు సమాచారం. విశాఖలో వైసీపీ ఉనికిని దెబ్బ తీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    Also Read: తెలంగాణకు బీజేపీ సీఎంలు వరుసగా ఎందుకొస్తున్నారు?

    రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఒక వైపు టీడీపీతో పొత్తు ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతం జనసేనతో స్నేహభావం చూపుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉంటుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. వైసీపీని టార్గెట్ చేసుకుని విమర్శలుచేస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానీయకుండా చేసేందుకే బీజేపీ సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.

    రాష్ర్టంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారిన క్రమంలో బీజేపీ వైసీపీని అడ్డుకోవాలని చూస్తోంది. గతంలో జరిగిన బద్వేల్ ఎన్నికల్లో కూడా వైసీపీ దొంగ ఓట్లు వేయించిందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు అడ్డుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే రాష్ర్టంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

    Also Read: మీడియాలో రచ్చవుతున్న చంద్రబాబు ‘లవ్’ కామెంట్స్

    Tags