Homeజాతీయ వార్తలుBJP Focus On Telangana: తెలంగాణ‌పై ఢిల్లీ నేత‌ల క‌న్ను.. ఏప్రిల్ లో మ‌రింత హీటెక్క‌నున్న...

BJP Focus On Telangana: తెలంగాణ‌పై ఢిల్లీ నేత‌ల క‌న్ను.. ఏప్రిల్ లో మ‌రింత హీటెక్క‌నున్న రాజ‌కీయాలు

BJP Focus On Telangana: తెలంగాణ‌లో మొన్న‌టి వ‌ర‌కు స్టేట్ లెవ‌ల్ లీడ‌ర్లు కుస్తీ ప‌ట్టారు. కానీ ఇక నుంచి జాతీయ నేత‌లు రంగంలోకి దిగుతున్నారు. వారంతా తెలంగాణ గ‌డ్డ‌మీద నువ్వా నేనా అన్న‌ట్టు త‌ల‌ప‌డ‌బోతున్నారు. దీంతో తెలంగాణ జాతీయ స్థాయిలో రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు కాబోతోంది. కేసీఆర్ ను గ‌ద్దె దించాల‌ని ఇప్ప‌టికే బీజేపీ తీవ్ర స్థాయిలో ప్ర‌య‌త్నిస్తోంది.

BJP Focus On Telangana
BJP

ముఖ్యంగా అమిత్ షా తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృష్టిని సారిస్తున్నారు. కేసీఆర్ కేంద్రంపై ఒంటికాలిమీద లేవడంతో.. అమిత్ షా, మోడీలు తెలంగాణ మీద ప్ర‌త్యేక దృష్టిని సారిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వ‌ర‌లోనే అమిత్ షా తెలంగాణ‌కు రెండు సార్లు రావాల‌ని అనుకుంటున్నారు. రెండో విడ‌త బండి సంజ‌య్ పాద‌యాత్ర ప్రారంభోత్స‌వానికి వ‌చ్చి సంజ‌య్ పాద‌యాత్ర‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావాల‌ని భావిస్తున్నారు.

Also Read: Telugu Desam Party: నాలుగు దశాబ్దాల పయనం…పడిలేస్తూ..లేచిపడుతూ ఎగసిపడుతున్న తెలుగుదేశం పార్టీ

మ‌రోసారి శ్రీరామ న‌వమి రోజున వ‌స్తున్నారు. ఆరోజు ఆధ్యాత్మిక యాత్ర‌ను చేప‌ట్ట‌నున్నారు. ఇక కాంగ్రెస్ కూడా ఏప్రిల్ నెల‌లో భారీ ప్లాన్ చేస్తోంది. రేవంత్ త‌న బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని ఎప్ప‌టి నుంచో భావిస్తున్నారు. రాహుల్‌ను రాష్ట్రానికి ర‌ప్పించి త‌న బ‌ల‌మేంటో చూపించాల‌ని క‌సి మీద ఉన్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగులతో ఓ సభ నిర్వ‌హించాల‌ని చూస్తున్నారు.

ఇక కేజ్రీవాల్ కూడా తొమ్మిది రాష్ట్రాల్లో ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టారు. ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఆయ‌న కూడా ఏప్రిల్ లోనే రాష్ట్రానికి వ‌స్తున్నారు. తెలంగాణలో పాదయాత్ర చేసే అవ‌కాశం కూడా ఉంది. విచిత్ర ఏంటంటే.. అమిత్ సా వ‌స్తున్న ఏప్రిల్ 14న కేజ్రీవాల్ కూడా వ‌స్తున్నారు. ఇలా జాతీయ స్థాయి నాయ‌కులంతా తెలంగాణ‌లో మ‌కాం వేయ‌నున్నారు.

BJP Focus On Telangana
BJP and KCR

ఇన్ని రోజులు జాతీయ స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించుకున్న వీరంతా.. త్వ‌ర‌లోనే తెలంగాణ వేదిక‌గా పోటీ ప‌డ‌బోతున్నారు. మ‌రి ఇంత‌మంది జాతీయ నాయ‌కులు వ‌చ్చి టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం మీద విరుచుకు ప‌డితే.. ప్ర‌భావం వేరే లెవ‌ల్ లో ఉంటుంది. కేజ్రీవాల్ లాంటి నేత‌లు వచ్చి విమ‌ర్శ‌లు చేయ‌డం అంటే ఎంతో కొంత టీఆర్ ఎస్ ఎఫెక్ట్ ప‌డే ఛాన్స్ లేక‌పోలేదు.

మ‌రి ముప్పేట ముంచుకొస్తున్న దాడిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటార‌న్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరంతా కేసీఆర్‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తారా.. లేక ప‌నిలో ప‌నిగా ఒక‌రి మీద మ‌రొక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకుంటారా అన్న‌ది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తంగా చూస్తుంటే.. తెలంగాణ కేంద్రంగా జాతీయ స్థాయి నేత‌లు కుస్తీ ప‌ట్ట‌బోతున్నార‌న్న మాట‌.

Also Read: Raj Subramaniam New CEO Of FedEx: మ‌రో అంత‌ర్జాతీయ దిగ్గ‌జ కంపెనీకి సీఈవోగా ఇండియ‌న్ సంత‌తి వ్య‌క్తి..

Recommended Video:

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

7 COMMENTS

  1. […] CM KCR Paddy Issue: రైతులు అన్యాయమైపోతున్నారు.. వారి ధాన్యం కేంద్రం కొనడం లేదన్న టీఆర్ఎస్ నేతల విమర్శలనే అందరూ చూస్తున్నారు. మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఈ కొనుగోళ్ల వెనుకున్న గోల్ మాల్ ఏంటన్నది మాత్రం ఎవరూ గుర్తించడం లేదు. పొద్దున లేస్తే రైతులను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొని వరి ధాన్యం కొనుగోళ్లపై యాగీ చేస్తున్న టీఆర్ఎస్ నేతలు నిజానికి వాళ్లే నిర్లక్ష్యం, అసమర్థత వల్లే ఈ దుస్థితి దాపురించిందన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.. ‘తమది రైతు ప్రభుత్వం. రైతుల కోసం దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సాగు పెట్టుబడికి ఎకరాకు ఏటా రూ.10 వేలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు ఇచ్చాం. గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు బీమా వర్తింపజేస్తున్నాం. రైతు ఏదైనా కారణంతో చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రూ.5 లక్షల ఆర్థికసాయం ఇస్తున్నాం’ ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మొదలు పార్టీ మండల నాయకుల వరకు రైతుల గురించి చెప్పే గొప్ప ఆణిముత్యాలు.. చేసుకునే ప్రచారం బయట ఇదీ.. ఇందులో భాగంగానే రైతుబంధు ప్రారంభించిన కేసీఆర్‌ ప్రభుత్వం ఏటా రైతులకు కేవలం రూ.10 వేలు ఇస్తూ.. మరో పదివేలు మిగుల్చుకుంటోంది. ఇదేలా అంటే.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, ట్రాక్టర్లు, స్ప్రింక్లర్లు, రొటోవేటర్లు, 20 నుంచి 30 శాతం సబ్సిడీతో అందేవి. డ్రిప్‌ పరికరాలు దళిత రైతులకు 90 శాతం సబ్సిడీ, మిగతా రైతులకు 70 శాతం సబ్సిడీతో అందేవి. ఇందుకోసం ఉమ్మడి రాష్ట్రంలో ఏటా వ్యవసాయ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సబ్సిడీలన్నీ ఒక్కొక్కటిగా మాయమయ్యాయి. సబ్సిడీలన్నీ లెక్కగట్టిన సీఎం కేసీఆర్‌ రైతులను ఆకట్టుకునేందుకు ఆకర్షక పథకం రైతుబంధు రూపొందించారు. గుంట భూమి ఉన్న రైతు నుంచి వందల ఎకరాల ఉన్న భూస్వాములకూ రైతుబంధు ఇస్తున్నారు. దీంతో 90 శాతం ఉన్న పదెకరాల్లోపు రైతులకు అందే రైతుబంధు సొమ్ముకంటే పది శాతం మంది ఉన్న భూస్వామయ్య రైతులకు అధికంగా పెట్టుబడి అందుతోంది. ఇది జగమెరిగిన సత్యం. ఈ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలకు, రైతులకు అర్థమవుతోంది. […]

  2. […] Paddy Issue: ధాన్యం సేకరణ అంశాన్ని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ లబ్ధిపొందాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ పోస్టులు చేయడం సంచలనం అవుతోంది. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం తనదైన శైలిలో స్పందించారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని పేర్కొంటూ విమర్శలు చేశారు. దీంతో కవిత చేసిన ట్వీట్ పై చురకనంటించినట్లు అయింది. ఏదో సానుభూతి పొందాలని కవిత భావించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నా అవేమీ పట్టించుకోవడం లేదు. […]

  3. […] Russia Ukraine War: యుక్రెయిన్ లో రష్యా సాగిస్తున్న మారణకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓవైపు రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే.. దాడులతో రష్యా సైనికులు విరుచుకుపడుతున్నారు. దీంతో యుక్రేయిన్ ప్రజలు ఇప్పటికే లక్షలాది మంది దేశం వదిలి వలస వెళ్లి పోతున్నారు. ఉన్నవారి ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియట్లేదు. […]

  4. […] KCR- China Jeeyar Swamy: ముచ్చింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో ఉన్న సమతామూర్తి విగ్రహానికి నాలుగు రోజుల పాటు భక్తుల సందర్శనకు అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. సమతామూర్తిని దర్శించుకోవాలంటే టికెట్లు తప్పనిసరి కొనుగోలు చేయాలనే నిబంధన విధించారు. దీంతో భక్తులకు పెడుతున్న కండిషన్లతో దర్శనానికి వచ్చే వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. దర్శనానికి వచ్చే వారు చెప్పులతో రావొద్దని బూట్లు ఉండకూడదని సూచిస్తున్నారు. ఎలాంటి ఆహార పదార్థాలు లోనికి తీసుకెళ్లరాదనే నిబంధన కూడా పెట్టారు. […]

  5. […] TDP: ఆంధ్రప్రదేశ్ లో నేడు టీడీపీ ఆవిర్భావ సభ నిర్వహించారు. అధికారానికి దూరమైన నేపథ్యంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఆవిర్బవించి నలభై ఏళ్లు అవుతున్న సందర్భంలో రెండు దశాబ్దాలు అధికారంలో ఉండి 19 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. దీంతో రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే కార్యకర్తలను కార్యోణ్ముఖులను చేస్తున్నారు. ఇందుకు అందరిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular