Homeఎంటర్టైన్మెంట్Legendary Directors Of Tollywood: ఆ కోరికతో అల్లాడిపోతున్న లెజెండరీ దర్శకులు

Legendary Directors Of Tollywood: ఆ కోరికతో అల్లాడిపోతున్న లెజెండరీ దర్శకులు

Legendary Directors Of Tollywood:  థియేటర్ లో వెల్లకిలా పడుకొని తెర వైపు చూస్తూ ఉంటే.. క్రమక్రమంగా జీవితంలో జరిగిన సంఘటనలు, తాను తీసిన అనేక సినిమాల తాలూకు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ ఉన్నాయి. సినిమాలు అంటే తనకు ప్రాణం.. కానీ, ఇప్పుడు ఏ సినిమా చూడలేక లోలోపల సతమవుతూ ఉన్నాడు. తన తోటి దర్శకులంతా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నారు. మరోపక్క తనను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉన్నారు.

Legendary Directors Of Tollywood
Legendary Directors Of Tollywood

ఒకప్పుడు తాను కాలు బయట పెడితే.. పాదాలు మొక్కడానికి క్యూలో ఉన్న జనం, ఇప్పుడు పిలిచినా పలకట్లేదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి.. ఆ వెలుగుల మాయ లోకంలో ఫేడ్ అవుట్ అయిపోయిన ప్రతి లెజెండరీ సీనియర్ దర్శకుల మనోగతం ఇది. తన అండగా ఉన్న గురువులు ఎప్పుడో తనని వదిలేసి వెళ్ళిపోయారు. బయటకు రాలేని నిస్సహాయతతో తన తోటి దర్శక స్నేహితులు ఇళ్ళల్లోనే జ్ఞాపకాలతో మగ్గిపోతున్నారు. కానీ, తనకు మాత్రం ఇంకా సినిమా చేయాలని ఘాడమైన కోరిక ఉంది. సాధ్యం అవుతుందా ?

Also Read: Best Dialogues From KGF Series: `కేజీఎఫ్` సిరీస్ నుంచి వచ్చిన బెస్ట్ డైలాగ్స్

తన ముందు నిక్కర్లేసుకుని తిరిగిన తన చేత తిట్లు తిన్న అసిస్టెంట్ డైరెక్టర్లు.. ఈ రోజు పెద్ద పెద్ద డైరెక్టర్లు. ఏ ఫంక్షన్ లోనే వాళ్ళంతా కనబడి తన చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ పలకరిస్తూ వెళ్తున్నారు. వారిలో కొంతమందికి తనతో మాట్లాడే సమయం కూడా లేదు. తన దగ్గర జాయిన్ అవ్వడానికి వాళ్ళు పడిన పాట్లు తనకు చిన్నగా గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు. కానీ.. ఈ రోజు తనను వాళ్ళు పట్టించుకోవడం లేదు. తనకు కాలం విలువ మరోసారి తెలిసొచ్చింది.

తన జీవితంలో తాను ఎన్నో విజయాలు సాధించి ఉండవచ్చు, తన దర్శకత్వ ప్రతిభ, కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు.. కానీ దాన్ని నేడు ఎవరూ గుర్తించే స్థితిలో లేరు. తన నుంచి హిట్ సినిమాలు రావడం ఆగిపోయిన క్షణం నుంచే.. తన మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయింది. ఈ సినీ ఇండస్ట్రీ తన గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయిపోయింది.

Legendary Directors Of Tollywood
Legendary Directors Of Tollywood

అయినా సినిమా చేయాలనే తపన తనలో ఇంకా రగులుతూనే ఉంది. దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి కావుమని అరుస్తూ ఉంటుంది కదా.. అలాగే ప్రతి సీనియర్ దర్శకుడు మరోసారి వెండితెర పై మ్యాజిక్ చేయాలని తనలో తానే ఆశ పడుతూ ఉంటాడు. తనలాంటి దర్శకుల గురించి తానే అనుకున్న మాట ఇది. కానీ తమ కోరిక సాధ్యం అవుతుందా ?

వయసు అయిపోయిన డైరెక్టర్ వి.. నిర్మాతలు నిన్ను నమ్ముతారా ? అంటూ తనవాళ్ళే తనను అనుమానించారు మరి. ఒక విధంగా ఇదే నిజం ఏమో. తాను అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడితినే పట్టించుకోని నిర్మాతలు.. రోజూ తన దగ్గరకు వచ్చి కథా చర్చల్లో ఎందుకు కూర్చుంటారు ? అసలు తన అమూల్యమైన అనుభవాన్ని, అభిప్రాయాన్ని ఈ డిజిటల్ జనరేషన్ ఎందుకు పట్టించుకుంటుంది ?

అర్ధరాత్రి ఏ నొప్పితోనో తనకు మెలకువ వచ్చి అరిచినా.. పక్కగదిలో ఉన్న తన పిలల్లు నిద్రాభంగానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక బయట వ్యక్తులు తన ఆలోచనలను ఎందుకు నమ్మాలి. రోజూ ఇలాగే ఆలోచిస్తూ ఆలోచిస్తూ జ్ఞాపకాల్లో బతకడం జీవితంలో భాగమైపోయింది. ప్రస్తుతం ప్రతి సీనియర్ దర్శకుడు పరిస్థితి ఇదే. హే.. ? ఏ.. సింగీతం శ్రీనివాసరావు లాంటి లెజండరీ దర్శకుడికి ఎందుకు అవకాశాలు ఇవ్వకూడదు. సినిమా ఛాన్స్ కోసం ఆయన ఈ వయసులో కూడా ఆఫీస్ ల చుట్టూ తిరగడం ఎంత బాధాకరమైన విషయం. నిర్మాతల్లారా ఆలోచించండి.

Also Read: SS Rajamouli First Movie: రాజమౌళి మొదటి సినిమా ఏదో తెలుసా.. విడుదలకు నోచుకోలేదు..

Recommended Video:

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper