Somu Veeraju: ఏపీలో ఓవైపు సంక్షేమం అంటూ మరోవైపు బాదుడు షురూ చేసింది జగన్ సర్కార్. కోట్ల రూపాయలు పేదలకు పంచుతూ మరోవైపు ధరలను ఆకాశాన్ని అంటేలా పెంచేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే మద్యం ధరలను చుక్కలనంటేలా చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు విద్యుత్ చార్జీలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. ఈ మేరకు దీనిపై బీజేపీ పోరుబాట పట్టింది.
ఏపీ బీజేపీ అల్టిమేటం జారీ చేసింది. పెంచిన విద్యుత్ చార్జీలను వాపస్ తీసుకోవాల్సిందేనని ఏపీబీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ విద్యుత్ చార్జీల బాదుడు ప్రకటన వెలువడిన వెంటనే ఈ డిమాండ్ చేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారీగా విద్యుత్ చార్జీలు పెరిగాయని ఆరోపించారు పెంచిన విద్యుత్ ఛార్జీల ప్రకారం 30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45 పైసలు పెంచారని.. సామాన్యుడికి ఎంత భారం అని ప్రశ్నించారు
Also Read: Pakistan PM Imran Khan: పాక్ ప్రధానికి పదవీ గండం? సైన్యం లేపేస్తుందా?
– 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్‌కు 95 పైసలు , అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57 పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారు. అదేవిధంగా 400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు రూ.55 పెంచుతూ తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల ను ఉపసంహరణ చేసేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఒక వైపు విద్యుత్ చార్జీలను పెంచి మరో వైపు అనధికారికంగా పవర్ కట్ ప్రారంభించారని ఆరోపించారు. విద్యుత్ విషయంలో ప్రభుత్వం తుగ్లక్ చర్యలు కు పాల్పడు తోందని సోము వీర్రాజు ఆరోపించారు
Also Read: Vijay Devarakonda: అతను కొడితే విజయ్ దేవరకొండ బ్రెయిన్ షేక్ !