Homeఎంటర్టైన్మెంట్Varun Tej Ghani Trailer Talk: ట్రైలర్ టాక్ : బాక్సింగ్ డ్రామాలో ...

Varun Tej Ghani Trailer Talk: ట్రైలర్ టాక్ : బాక్సింగ్ డ్రామాలో ‘వరుణ్ తేజ్’ ఎమోషనల్ డ్రామా

Varun Tej Ghani Trailer Talk: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కాగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ‌వదిలారు మేకర్స్. ‘గని ఇక లైఫ్ లో బాక్సింగ్ ఆడను అని ప్రామిస్ చేయి’ అంటూ మొదలైన ఈ సినిమా ట్రైలర్ లో వరుణ్ తేజ్ క్యారెక్టర్ ను, అలాగే అతని లైఫ్ లో జరిగిన క్లాషెస్‌ ను ఈ ట్రైలర్ లో చాలా బాగా చూపించారు. బాక్సింగ్ సన్నివేశాల ఎలివేషన్ షాట్స్ కూడా అదిరిపోయాయి.

Varun Tej Ghani Trailer Talk
Varun Tej Ghani Trailer Talk

ఇక టైటిల్‌ కు తగ్గట్టుగానే సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర ఇంట్రడక్షన్ అద్భుతంగా ఉంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఈ సినిమా ఉండబోతుంది అని అర్ధం అవుతుంది. ట్రైలర్ లో వరుణ్ తేజ్ చాలా వైలెంట్ గా కనిపించాడు. బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో కనిపించిన వరుణ్ తేజ్ లుక్స్ బాగున్నాయి.

Also Read: Yash KGF2 Censor Report: సెన్సార్ రిపోర్ట్ : `కేజీఎఫ్ 2′ రన్ టైమ్ ఎంతంటే.. ?

మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు. అయితే ఈ సినిమాలో బాక్సర్‌ పాత్రలో నటించడానికి వరుణ్‌తేజ్‌ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు.

Varun Tej Ghani
Varun Tej Ghani Movie Trailer Update

అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గతంలో ‘బాలు’ అనే సినిమాలో చేసిన హీరో క్యారెక్టర్ పేరు ‘గని’నే. ఇప్పుడు వరుణ్ తేజ్, పవన్ సినిమా పేరును తన సినిమాకి టైటిల్ గా పెట్టుకోవడం విశేషం. వరుణ్ తేజ్ కి పవన్ పేర్లను వాడుకోవడం సెంటిమెంట్ అయిపోయింది. పవన్ సినిమా ‘తొలిప్రేమ’ టైటిల్ తోనే ఒక సినిమా చేసి వరుణ్ తేజ్ హిట్ కూడా కొట్టాడు.

మరి ఇప్పుడు కూడా గనితో హిట్ కొడతాడేమో చూడాలి. కాగా ఈ సినిమాతో అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

 

Ghani Trailer | Varun Tej, Saiee M Manjrekar | Kiran Korrapati | Thaman S | Allu Aravind

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version