UP Election BJP Manifesto: భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది.ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పలు తాయిలాలు ప్రకటించింది. మధ్య తరగతి ప్రజల ఆశలకు అనుగుణంగా మేనిఫెస్టోలో పలు విషయాలు వెల్లడించింది. మహిళలకు సైతం పెద్దపీట వేసింది. దీంతో యూపీలో అధికార పీఠం మరోసారి కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచించింది.
హోలీ, దీపావళి పండుగలకు వినియోగదారులకు ఉచిత సిలిండర్లు, యువతులకు స్కూటీలు, స్మార్ట్ ఫోన్లు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెట్టింపు, మహిళా విద్యార్థినులకు ఉచిత కోచింగ్, యువతకు ఉపాధి, అరవై ఏళ్లు నిండిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తదితర వాగ్దానాలను మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ హామీలు కురిపించింది.
ఈనేపథ్యంలో యూపీలో అధికారంచేజిక్కించుకోవాలని బీజేపీ చూస్తోంది. దీనికి గాను ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే సర్వేలు బీజేపీ, ఎస్పీ మద్యే పోటీ నెలకొందని చెబుతుండటంతో బీజేపీ ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవడానికే ప్రయత్నిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలతో కమలదళం ముందుకు వెళ్తోంది.
అటు ఎస్పీ కూడా తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతోంది. అధికార పగ్గాలు చేపట్టాలని ఇరు పార్టీలు తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాయి. ఇక బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రభావం చూపలేకపోతున్నాయి. దీంతో బీజేపీ, ఎస్పీలే ప్రధాన భూమిక పోషించనున్నాయని తెలుస్తోంది. ఇకయూపీలో ద్విముఖ పోరే ప్రధానంగా సాగనుంది. బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
Also Read: బాప్ రే ఏంటిది? రోజా ఇల్లు చూస్తే మీరంతా షాక్ యే.. హోంటూర్ వీడియో వైరల్
లవ్ జీహాదీలకు పదేళ్ల జైలు, లక్ష జరిమానా విధిస్తామని చెప్పింది. దేశ భద్రతకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని సూచించింది. దీంతో బీజేపీ మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉందని తెలుస్తోంది. దీనికి గాను ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది. ఫిబ్రవరి 10న తొలివిడత ఎన్నికలు మొదలు కానున్నాయి. దీని కోసం పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి.
ఓటర్లను ప్రభావితం చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఓట్లు రాబట్టుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో యూపీ ఓటర్లను పార్టీలు తమ వాగ్దానాలతో ఆకట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే అధినేతల పర్యటనలతో రాష్ట్రంలో సుడిగాలిలా తిరిగిన సందర్భంలో విజయావకాశాలు మావే అని బీజేపీ భావిస్తోంది. ఎస్పీ కూడా అదే దారిలో గెలుపుపై గురి పెట్టింది. దీంతో భవిష్యత్ లో ఏం జరుగుతుందో తెలియడం లేదు.
Also Read: పంజాబ్‌లో కాంగ్రెస్ కొత్త వ్యూహం.. వర్కౌట్ అయితే రేవంత్‌కు గోల్డెన్ ఛాన్స్..?