Chiranjeevi: ఈ నెల 10న జగన్ తో చిరంజీవి భేటీ !

Chiranjeevi: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ కానున్నారు. ఈనెల 10వ తేదీన ముఖ్యమంత్రిని ఆయన కలవనున్నారు. చిరంజీవితో పాటు మరో ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంతో సమావేశం కానున్నారు. టికెట్ ధరలతో పాటు, సినీ పరిశ్రమ సమస్యలపై వీరు చర్చించనున్నారు. వాస్తవానికి ఈరోజు జగన్ తో భేటీ కావాలని చిరంజీవి భావించారు. అయితే ఇండస్ట్రీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం 10వ తేదీకి వాయిదా పడింది. జగన్ తో మెగాస్టార్ మళ్ళీ […]

Written By: Raghava Rao Gara, Updated On : February 9, 2022 8:16 pm
Follow us on

Chiranjeevi: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ కానున్నారు. ఈనెల 10వ తేదీన ముఖ్యమంత్రిని ఆయన కలవనున్నారు. చిరంజీవితో పాటు మరో ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంతో సమావేశం కానున్నారు. టికెట్ ధరలతో పాటు, సినీ పరిశ్రమ సమస్యలపై వీరు చర్చించనున్నారు. వాస్తవానికి ఈరోజు జగన్ తో భేటీ కావాలని చిరంజీవి భావించారు. అయితే ఇండస్ట్రీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం 10వ తేదీకి వాయిదా పడింది.

Chiranjeevi

జగన్ తో మెగాస్టార్ మళ్ళీ ఎల్లుండు భేటీ కాబోతున్నారు. ఇటీవల ఆయన సీఎంను కలవగా.. సినిమా టికెట్ల విషయంలో గుడ్‌ న్యూస్ వింటారని భేటీ అనంతరం తెలిపారు. అయితే దానిపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ‘ఏ ఒక్కరో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని.. జగన్‌తో చిరు భేటీ పర్సనల్’ అని తాజాగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి చిరంజీవి సీఎం జగన్‌తో ఈనెల 10న భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.

Also Read:  మూడేళ్ల చిన్నారిపై ముస‌లివాడి అఘాయిత్యం

కాగా సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలవనున్నారు చిరంజీవి. సినిమా టికెట్ల విషయంపై సీఎం తో మళ్లీ చర్చించి.. టికెట్ల వ్యవహారానికి ముగింపు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చిరంజీవి చేరుకోనున్నారు. సీఎం జగన్ ఇప్పటికే చిరంజీవికి అపాయింట్మెంట్ ఇచ్చారని తెలుస్తోంది. కాగా జగన్ తో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ అవుతుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Chiranjeevi

గత కొంత కాలంగా చిత్ర పరిశ్రమలో ఏపీలో ఎదుర్కొంటున్న సమస్యలపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరగనుంది. మరి చిరుతో భేటీ తర్వాత వైఎస్ జగన్ ఎలాంటి ప్రకటన చేస్తాడో ?ఈ మధ్య టాలీవుడ్‌ కు చెందిన కొందరు మాత్రం ఏపీ ప్రభుత్వంను సమర్థిస్తూ జగన్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అందుకే, జగన్ మేలు చేస్తాడేమో చూడాలి.

Also Read: ల‌వ్ జిహాదీల‌కు ప‌దేళ్ల శిక్షః యూపీలో బీజేపీ ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల

 

Tags