
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ కూటమితో ప్రతిపక్ష బీజేపీ కూటమి హోరాహోరీగా తలపడుతోంది. రెండు కూటముల మధ్య ఆధిక్యాలు దోబూచులాడుతున్నాయి. అయితే బీజేపీ -ఎఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి స్వల్ప ఆధిక్యంలో ఉంది.
పుదుచ్చేరిలో కాంగ్రెస్-డీఎంకే కూటమి.. బీజేపీ-ఏఎన్నార్ కూటములు కలిసి పోటీచేస్తున్నాయి. ఏ ఒక్కదానికి ఇప్పటిదాకా స్పష్టమైన మెజార్టీ రాలేదు.
మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఇప్పటిదాకా ఎన్డీఏ కూటమి 13 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 8 స్థానాల్లో లీడ్ లో ఉంది.
కాంగ్రెస్ తో పోలిస్తే ఎన్డీఏ కూటమికి స్వల్ప ఆధిక్యంలో ఉంది. మరో మూడు చోట్ల ఆధిక్యత వస్తే బీజేపీ కూటమిదే అధికారం అవుతుంది.