https://oktelugu.com/

కేసీఆర్ మౌనం వెనుక పెద్ద వ్యహమే ఉందా?

రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై కమలనాథులు రెచ్చి పోతున్నారు. కోవిద్ ని కట్టడి చేయడంలో టిఆర్ఎస్ సర్కార్ విఫలమైందని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీఎం కెసిఆర్ ఇప్పుడు ఎదుర్కొంటున్న విమర్శలు తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఎదుర్కోలేదనే టాక్ నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం…. దూకుడైన బండి సంజయ్ పగ్గాలు చేపట్టడంతో బిజెపి నలువైపులా కేసీఆర్ ను చుట్టుముడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల అద్వాన పరిస్థితిని ఎత్తి చూపడం, అతి తక్కువ సంఖ్యలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 3, 2020 1:11 pm
    Follow us on

    CMKCR in Pragathi Bhavan

    రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై కమలనాథులు రెచ్చి పోతున్నారు. కోవిద్ ని కట్టడి చేయడంలో టిఆర్ఎస్ సర్కార్ విఫలమైందని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీఎం కెసిఆర్ ఇప్పుడు ఎదుర్కొంటున్న విమర్శలు తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఎదుర్కోలేదనే టాక్ నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం…. దూకుడైన బండి సంజయ్ పగ్గాలు చేపట్టడంతో బిజెపి నలువైపులా కేసీఆర్ ను చుట్టుముడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల అద్వాన పరిస్థితిని ఎత్తి చూపడం, అతి తక్కువ సంఖ్యలో టెస్టింగ్ ని హైలైట్ చేయడం మరియు కెసిఆర్ పాలన పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ తమిళసై ని రంగంలోకి దించడం వంటి చర్యలతో టిఆర్ఎస్ ను విపరీతంగా ఇబ్బందిపెడుతోంది.

    అయితే సీఎం కేసీఆర్ కూడా బీజేపీ పై తనదైన శైలిలో బిజెపికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉన్నాడు. విషయం ఏమిటంటే తెలంగాణపై దూకుడుగా వెళ్తున్న కమల దళానికి కాంగ్రెస్ తో చెక్ పెట్టే వ్యూహాన్ని కేసీఆర్ తెరమీదకు తెచ్చాడు. ఇప్పుడు కెసిఆర్ మరియు అతని మంత్రులు, అధికార పార్టీ నేతలు బీజేపీ విమర్శలపై పెద్దగా స్పందించడం లేదు. కేవలం కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ పై ఘాటయిన కౌంటర్లు ఇస్తూ బిజెపి వారిపై వ్యూహాత్మక మౌనం నిర్వహిస్తున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే కాని అసలు బిజెపిని తాము లెక్కలోకి తీసుకోమన్నట్లు వ్యవహరిస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే పనిలో ఉన్నారు. ఇలా మానసికంగా దెబ్బతిన్న బిజెపి చివరికి అరిచి అరిచి ఓపిక నశించి కామ్ అవుతుందన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది.

    అందుకే తాజాగా కరోనా కాంగ్రెస్ చేపడుతున్న నిరసనలు ధర్నాలను సులువుగా పర్మిషన్లు ఇస్తోందట టీఆర్ఎస్ సర్కార్. అంతకుముందు అస్సలు అనుమతి ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ఆందోళనలకు అధికారులు ఆటంకం కలిగించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ఒక కొత్త స్ట్రాటజీని అవలంబించుకోవడం ద్వారా… బిజెపి ని హైలెట్ చేస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన కేసీఆర్, కాంగ్రెస్ ఎంత దూకుడుగా వెళ్లినా పరిస్థితి తమ అదుపులోనే ఉంటుందన్న నమ్మకంతో ఉన్నాడు. అంతే ఒకటే దెబ్బకు అటు బిజెపి ఇటు కాంగ్రెస్ ఇద్దరినీ సరైన సమయం లో చూసి ఒకే దెబ్బ కొడితే ఇద్దరూ మట్టికరుస్తారని కేసీఆర్ ప్లాన్ అన్నమాట.