ఏపీలో ఇప్పుడెక్కడ చూసిన జగన్ క్యాబినెట్లో ఎవరికీ అవకాశం దక్కుతుందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుత సమచారం మేరకు జగన్ క్యాబినెట్లో ఇద్దరికి మాత్రమే చోటు దక్కనుందట. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా క్యాబినెట్లో మార్పులు పెద్దగా చేయకపోవచ్చని టాక్ విన్పిస్తోంది. అయితే ఆశావహులు మాత్రం తమకే మంత్రి పదవీ దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.
శాసనమండలి రద్దు నిర్ణయంతో జగన్ క్యాబినెట్లోని ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది. వీరిస్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. జగన్ తొలిసారి క్యాబినెట్ భర్తీ చేపట్టినపుడే అన్ని కులాలు, ప్రాంతాలు, వర్గాలు లెక్కవేసుకొని పదవుల పంపకం చేపట్టారు. సామాజిక లెక్కల కారణంగానే పార్టీలోకి కొందరి వీరవిధేయులకు కూడా మంత్రి పదవీ దక్కలేదు. అన్నివర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో జగన్ క్యాబినెట్ పై ప్రతిపక్షాలు సైతం నోరుమెదపకుండా ఉన్నాయి.
జగన్ ఏడాది పాలన పూర్తయ్యేనాటికి క్యాబినెట్లో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. వీటి భర్తీతోపాటు కొంతమందిని తప్పించి మరికొందరికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే దీనిపై సీఎం జగన్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఖాళీ అయిన స్థానంతో ఎవరినీ తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం సస్పెన్స్ గానే కొనసాగుతోంది. కొత్త మంత్రుల విషయంలో రోజుకో కొత్తపేరు తెరపైకి వస్తోంది. తాజాగా సిక్కోలు జిల్లా పలాసాకు చెందిన డాక్టర్ సీదరి అప్పరాజు పేరు తెరపైకి వచ్చింది.
జగన్ క్యాబినెట్లో ఖాళీ అయిన రెండు పోస్టుల్లో అప్పలరాజుకు అవకాశం దక్కనుందని టాక్ విన్పిస్తోంది. అప్పలరాజు వృత్తి రీత్య డాక్టర్ కావడంతో ప్రజల్లో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. గతంలోనే ఆయన మంత్రి పదవీ లభిస్తుందని ఆశించారు. అయితే మండలి నుంచి ఎన్నికైన మోపిదేవీ రమణకు మంత్రి పదవీ దక్కింది. అయితే తాజాగా ఆయన మంత్రి పదవీ ఖాళీ అవడంతో అప్పలరాజుకే అవకాశం దక్కుతుందని అందరూ భావిస్తున్నారు.
మత్స్య సామాజిక వర్గం కూడా ఆయనకు కలిసి రానుందని లెక్కలు వేసుకుంటున్నారు. జగన్ దృష్టిలోనూ అప్పలరాజుకు మంచి గుర్తింపు ఉండటంతో ఈసారి ఆయనకే అవకాశం దక్కతుందని సిక్కోలువాసులు ఘంటాపథంగా చెబుతున్నారు. మరీ సీఎం జగన్ లెక్కల్లో అప్పలరాజు ఉన్నాడో లేదో వేచిచూడాల్సిందే..!