https://oktelugu.com/

జగన్ పై ట్వీట్ వైరల్.. రత్నప్రభను ట్రోల్ చేస్తున్నారట..

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ తరుఫున నిలబడ్డ మాజీ ఐఏఎస్ ను ఇప్పుడు వైసీపీ, టీడీపీలు టార్గెట్ చేశాయి. ఆమె గతంలో కర్ణాటకలో ఐఏఎస్ గా పనిచేసినప్పుడు సీఎం జగన్ ను అభినందించిన ట్వీట్ ను వైసీపీ, టీడీపీ నెటిజన్లు వైరల్ చేస్తూ ఆమె వైసీపీకి మద్దతుదారు అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మితే బీజేపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో తాజాగా ఆమె స్పందించారు. గతంలో సీఎం జగన్ ను […]

Written By: , Updated On : March 28, 2021 / 04:21 PM IST
Follow us on

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ తరుఫున నిలబడ్డ మాజీ ఐఏఎస్ ను ఇప్పుడు వైసీపీ, టీడీపీలు టార్గెట్ చేశాయి. ఆమె గతంలో కర్ణాటకలో ఐఏఎస్ గా పనిచేసినప్పుడు సీఎం జగన్ ను అభినందించిన ట్వీట్ ను వైసీపీ, టీడీపీ నెటిజన్లు వైరల్ చేస్తూ ఆమె వైసీపీకి మద్దతుదారు అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మితే బీజేపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో తాజాగా ఆమె స్పందించారు.

గతంలో సీఎం జగన్ ను తాను ప్రశంసించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని రత్నప్రభ చెప్పారు. మంచి పనిచేస్తే ప్రశంసించానని.. అంత మాత్రాన మద్దతు ఇచ్చినట్లు కాదని స్పష్టం చేశారు.

ఇక తన అభ్యర్థిత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 200శాతం సంతృప్తిగా ఉన్నారని రత్నప్రభ తెలిపారు. ప్రచారానికి ఆయనను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే రాష్ట్రం తరుఫున పార్లమెంట్ లో గట్టిగా స్వరం వినిపిస్తానని రత్నప్రభ తెలిపారు. ఆంధ్రా మాతృభూమి అని.. కర్ణాటక కర్మ భూమి అని.. ఇన్నాళ్లకు తనకు మాతృభూమికి సేవ చేసే అవకాశం వచ్చిందని చెప్పారు.

రేపు తిరుపతి ఎంపీ స్థానానికి బీజేపీ తరుఫున నామినేషన్ వేయనున్నట్లు రత్నప్రభ తెలిపారు. నెల్లూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు.