Munugodu By-Elections : గెలిస్తే మునుగోడుకు.. ఓడితే విదేశాలకు.. రాజగోపాల్ రెడ్డికి సీన్ అర్థమైందా?

Munugodu By-Elections : మునుగోడులో కాంగ్రెస్ కు రాజీనామా చేసి మరీ తొడగొట్టి బీజేపీ తరుఫున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నమ్మకం సడలుతోందా? ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలనుకోవడానికి కారణం ‘ఓటమిభయమా?’ అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే అన్న వెంకటరెడ్డి.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి తరుఫున ప్రచారం చేయలేక.. అటు కాంగ్రెస్ లో ఉండలే ఆస్ట్రేలియా చెక్కేశాడు. ఇప్పుడు తమ్ముడు కూడా వెళుతుండడం అందరిలోనూ అనుమానాలకు తావిస్తోంది. మునుగోడు ఉపఎన్నికల్లో బలంగా నిలబడ్డ బీజేపీ అభ్యర్థి […]

Written By: NARESH, Updated On : November 2, 2022 4:26 pm
Follow us on

Munugodu By-Elections : మునుగోడులో కాంగ్రెస్ కు రాజీనామా చేసి మరీ తొడగొట్టి బీజేపీ తరుఫున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నమ్మకం సడలుతోందా? ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలనుకోవడానికి కారణం ‘ఓటమిభయమా?’ అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే అన్న వెంకటరెడ్డి.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి తరుఫున ప్రచారం చేయలేక.. అటు కాంగ్రెస్ లో ఉండలే ఆస్ట్రేలియా చెక్కేశాడు. ఇప్పుడు తమ్ముడు కూడా వెళుతుండడం అందరిలోనూ అనుమానాలకు తావిస్తోంది.

మునుగోడు ఉపఎన్నికల్లో బలంగా నిలబడ్డ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్ట్రేలియాకు పర్యటనకు వెళ్లనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 7న ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన దగ్గర నుంచి ఆయన ప్రచారం నిర్వహించారు. తన ఎమ్మెల్యే స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు నిర్విరామంగా శ్రమించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించారు. అయినప్పటికీ గెలుపుపై ఆయనకు ఆశలు కనిపించడం లేదని సమాచారం.

ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చిన ఆయన ఈ నెల 6 వ తేదీన ఫలితాలు ప్రకటించగానే 7వ తేదీన ఆస్ట్రేలియా టూర్‌కు వెళుతున్నట్లు తెలుస్తోంది. విశ్రాంతి కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతున్నారని సమాచారం. తన ప్రయాణానికి సంబంధించి బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 7న ఆస్ట్రేలియాకు వెళుతున్నారనే వార్త నిజమేనా? అనే దానిపై కూడా అనుమానం కూడా వ్యక్తమవుతోంది. మరో వైపు గత నెల 15న ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇవాళ హైదరాబాద్‌కు వచ్చి…అక్కడి నుంచి నల్గొండకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇలా అన్న రాక.. తమ్ముడి పయనం చూస్తుంటే మునుగోడులో బీజేపీకి తేడా కొట్టినట్టే కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.