ఆంద్రప్రదేశ్ లో మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రకంపనలు రేపుతున్నాయి. సస్పెన్షన్ లో ఉన్న నిమ్మగడ్డ బీజేపీ నాయకులతో రహస్య సమావేశంలో పాల్గొనడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామాన్ని వైసీపీ ప్రభుత్వంపై జరుగుతున్న కుట్ర అని ఆ పార్టీ నాయకులు వాదిస్తుండగా…నిమ్మగడ్డ వారిని కలవడంలో తప్పేంటి అని టీడీపీ జవాబు ఇస్తుంది. నిజానికి ఈ విషయంలో టీడీపీ ఎందుకు జోక్యం చేసుకుంటుంది అనేది ఆసక్తికర అంశం. ఇక్కడ నిమ్మగడ్డ కలిసింది..ఒకప్పటి టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మరియు బీజేపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కావడం గమనార్హం. నిమ్మగడ్డ రాజ్యాంగ పదవిలో ఉండి, ప్రైవేటుగా నేతలను కలవడం పెద్ద దుమారం లేపుతుంది.
వైసీపీకి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చిన ఎంపీ..!
ఐతే ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు భాగస్వాములు కావడం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులలో అసహనానికి కారణమైంది. నిమ్మగడ్డతో సుజనా మరియు కామినేని మీటింగ్ వలన బీజేపీ పై ప్రజల్లో చెడు అభిప్రాయం తీసుకొచ్చే సూచనలు కలవని వారు భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆంద్రప్రదేశ్ లో ఎదుగుతున్న బీజేపీ పార్టీకి ఇలాంటి సంఘటనలు చేటు చేసే అవకాశం కలదని వారు భావిస్తున్నారు. దీనితో ఈ మీటింగ్ లో పాల్గొన్న బీజేపీ నేతలపై వీరు చర్యలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ మరికొందరు సీనియర్ నాయకులు కేంద్రంలో అధిష్ఠానాన్ని కలిసి సుజనా మరియు కామినేనిపై పిర్యాదు చేయనున్నారట.
విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు?
ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో తమ అనుమతి లేకుండా నిమ్మగడ్డను రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమిటనేది రాష్ట్ర బీజేపీ నాయకుల ప్రశ్న. ఈ రహస్య భేటీ బీజేపీ వర్గాలలో అభద్రతా భావం, మరియు అయోమయానికి గురిచేసినట్లు తెలుస్తుంది. టీడీపీ గవర్నమెంట్ లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలున్న సుజనా ఈ మీటింగ్ లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసుల నుండి తప్పించుకోవడానికి మరియు టీడీపీ కోవర్టుగా వ్యవహరించడానికి ఆయన బీజేపీలో చేరాడన్న వాదన ఎప్పటి నుండో ఉంది. ఆయన బీజేపీలో చేరింది చంద్రబాబు ప్రయోజనాలు కాపాడడానికే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుజనా రాష్ట్ర స్థాయిలో బీజేపీకి చేటు చేసే ప్రమాదం ఉందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మరి వీరిపై బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.