కల్నల్ సంతోష్ బాబు విగ్రహం రెడీ.. చూస్తారా?

భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వానాలోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. చైనా దొంగదెబ్బ తీయడంతో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు వీరమరణం పొందాడు. సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు సహా మరో 19మంది అమరులయ్యారు. ఈ ఘర్షణలో చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించలేదు. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు? భారత జవాన్ల మృతిపై యావత్ దేశం ఘనంగా నివాళి అర్పించింది. కల్నల్ […]

Written By: Neelambaram, Updated On : June 26, 2020 12:14 pm
Follow us on


భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వానాలోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. చైనా దొంగదెబ్బ తీయడంతో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు వీరమరణం పొందాడు. సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు సహా మరో 19మంది అమరులయ్యారు. ఈ ఘర్షణలో చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించలేదు.

విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు?

భారత జవాన్ల మృతిపై యావత్ దేశం ఘనంగా నివాళి అర్పించింది. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటామని ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5కోట్ల భారీసాయం ప్రకటించారు. ఇటీవల సీఎం కేసీఆర్ సూర్యాపేటలోని సంతోష్ బాబు కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. సంతోష్ బాబు పిల్లల పేరిట 4కోట్లు, ఆయన తల్లిదండ్రులకు ఒక కోటి రూపాయాల చెక్కును అందజేశారు. సంతోష్ బాబు భార్యకు బంజార హిల్స్ 711గజాల ఇంటిస్థలం, గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగ నియామక ప్రతాన్ని అందించారు.

వైసీపీకి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చిన ఎంపీ..!

అంతేకాకుండా సూర్యాపేటలో సంతోష్ బాబు గౌరవార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సూర్యాపేటలోని పాత బస్టాండ్ జంక్షన్లో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తుంది. ఈ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శిల్పులు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. విగ్రహ నిర్మాణం దాదాపు పూర్తయింది. చివరగా విగ్రహానికి తుది మెరుగులు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని త్వరలోనే సూర్యాపేట పాత బస్టాండ్ జంక్షన్ ప్రతిష్టించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.