Homeఆంధ్రప్రదేశ్‌YCP Leaders: వైసీపీ నేతల ఉసురుతీస్తున్న సర్కారు.. బిల్లులు చెల్లించకపోవడంతో బలవన్మరణాలు

YCP Leaders: వైసీపీ నేతల ఉసురుతీస్తున్న సర్కారు.. బిల్లులు చెల్లించకపోవడంతో బలవన్మరణాలు

YCP Leaders: వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి సొంత పార్టీ నేతలే మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ప్రభుత్వ అభివ్రుద్ధి పనులకు చెల్లింపులు లేవు. చేసిన పనులకు బిల్లులు లేవు. వ్యవస్థలు సక్రమంగా పనిచేయక.. సకాలంలో పనులు కాక సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్మాణాల కాంట్రాక్ట్ బాధ్యతలు తీసుకున్న ఓ మైనార్టీ నాయకుడు విషాదాంతం కలిచివేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన వైసీపీ ముఖ్య కార్యకర్త పక్కిరి మహబూబ్‌ బాషా (45) బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి సన్నిహితుడని గ్రామస్థులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక హుసేనాపురంలో రైతు భరోసా కేంద్రం భవనం నిర్మాణం పనులను సొంతంగా కాంట్రాక్టు తీసుకొని చేశారు.అదే పార్టీకి చెందిన కొందరు కార్యకర్తల భాగస్వామ్యంతో హుసేనాపురం ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌, ఓర్వకల్లులోని ఉన్నత పాఠశాల, హుసేనాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరమ్మతుల పనులు నాడు-నేడు కింద చేశారు. ఇందుకోసం అధిక వడ్డీలకు దాదాపు రూ.80 లక్షలకు పైగా అప్పుచేశారు.

YCP Leaders
YCP Leaders

ఇది ఒక మహబూబ్ బాషా పరిస్థితే కాదు. ఏపీలో వేలాది మంది అధికార పార్టీ నాయకులు ఇదే విధంగా బాధపడుతున్నారు. గ్రామాల్లో సొంత ఆస్తులను సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలకు అందించారు. కాంట్రాక్ట్ లభిస్తే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని భావించారు. లక్షలాది రూపాయలు చేతి మదుపు పెట్టుకొని నిర్మాణాలు చేపట్టారు. ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణ దశను బట్టి బిల్లులు చెల్లిస్తామన్న ప్రభుత్వం మాట తప్పింది. తీవ్ర జాప్యం చేస్తూ వస్తోంది. దీంతో చాలా మంది నిర్మాణాలను మధ్యలో నిలి నెలలు గడిచిపోయినా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం, బిల్లులు ఇచ్చే పరిస్థితి కనిపించక పోవడం, మరోపక్క అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు పెరగడంతో దిక్కుతోచక ఈనెల 6 తేదీన బాషా ఊరు వదిలి వెళ్లిపోయారు.

Also Read: Venkatapalem TTD Temple: అమరావతిపై అదే అక్కసు.. శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠకు సీఎం జగన్ డుమ్మా

ఆయన ఆచూకీ తెలియక పోవడంతో ఈనెల 7న ఆయన భార్య పి. ఫరీదా ఓర్వకల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. బాషా హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు, కొందరు వైసీపీ నాయకులు అక్కడికి వెళ్లి ఆయనను తీసుకొని వచ్చి బుధవారం రాత్రి కర్నూలులో ఉంటున్న కూతురు ఇంట్లో వదిలివచ్చారు.అయితే గురువారం తెల్లవారుజామున 5 గంటలకే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన మహబూబ్‌ బాషా.. నంద్యాల జిల్లా పరిధిలోని వెలుగోడు సమీపంలోని తెలుగు గంగ జలాశయం దగ్గరలో గల తన పొలానికి వెళ్లి అక్కడే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు.పివేశారు.

YCP Leaders
Mahaboob Basha

బిల్లులు చెల్లిస్తేనే పనులు ప్రారంభిస్తామని తేల్చిచెబుతున్నారు. అటు అధికారులు సైతం ఒత్తిడి చేస్తుండడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ప్రభుత్వం నుంచి బిల్లులు లేవు. లక్షలాది రూపాయలను బయట అధిక వడ్డీకి తేవడంతో రుణదాతల నుంచి ఒత్తడి ఎదురవుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. వివాహం సమయంలో అత్తవారు ఇచ్చిన బంగారు ఆభరణాలు కుదువ పెట్టి సచివాలయ నిర్మాణం చేపట్టానని.. ఇప్పటివరకూ బిల్లులు చెల్లించలేదంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఎంపీపీ డీఆర్సీ మీటింగ్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అదే సమావేశంలో ఉన్నమంత్రి ధర్మాన ప్రసాదరావు నిస్సహాయత వ్యక్తం చేశారే తప్ప భరోసా కల్పించలేకపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోకుంటే వైసీపీ దిగువస్థాయి నాయకులు పార్టీ అంటే ఏవగించుకునే అవకాశముంది.

Also Read:Nara Lokesh Zoom Meeting- YCP Leaders: పద్ధతి తప్పిన వైసీపీ నేతలు…అసలు జూమ్ కాన్ఫరెన్స్ లో ఎందుకు ప్రవేశించినట్టు?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version