
దానంలో కర్ణుడిని ఉదాహరణగా చెబుతారు. కుడిచేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదంటారు. నలుగురికి సాయం చేయాలనే గుణం మంచిదే. ప్రపంచంలో దాతృత్వ కార్యక్రమాలు చేపట్టే వారిలో ప్రముఖుడు ఏ అమెరికా, యూరోపియనో అన్న భావన కలగడం సహజమే. దానగుణమున్న వారిలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గుర్తుకు వస్తుంది.
గడిచిన ఐదేళ్లలో ప్రపంచంలో అతిపెద్ద దాతృత్వ శీలి ఎవరన్న విషయంపై ఒక అధ్యయనం జరిగింది. ప్రపంచంలో అత్యంత దానశీలి ఎవరో కాదు భారతపారిశ్రామిక పితామహుడు జెడ్ షెడ్డీ టాటా అని తేలింది. హూరన్, ఎడెల్ గివ్ ఫౌండేషన్ రూపొందించిన టాప్ 50 దాతల జాబితాలో జెమ్ షెడ్డీ పేరు అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆయన దానం చేసిన రూ.7.65 లక్షల కోట్లు గా తేల్చారు.
ఆయన తరువాత స్థానంలో బిల్ గేట్స్ నిలిచారు. ఆయన ఇప్పటివరకు 74.6 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలవగా 37.4 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ మూడో స్థానంలో నిలిచారు. తరువాత స్థానాల్లో జార్జ్ సోరోస్ 26.8 బిలియన్ డాలర్లతో జాన్ డి రాక్ ఫెల్లర్ ఉన్నారు. దేశీయంగా చూస్తే టాటా తర్వాత భారతీయుల్లో ఎక్కువగా దానం చేసిన వారిలో విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్ జీ నిలిచారు.
టాప్ 50 జాబితాలో టాటాతర్వాత చోటు దక్కించుకున్నది అజీమ్ ప్రేమ్ జీ ఒక్కరే. టాప్ 50 మందిలో అమెరికన్లు 38 మంది కాగా బ్రిటన్ నుంచి ఐదుగురు, చైనా నుంచి ముగ్గురు ఉన్నారు. జాబితాలో యాభై మందిలో 37 మంది మరణిస్తే 13 మంది మాత్రమే జీవించి ఉన్నారు. ఈ యాభై మంది గడిచిన వందేళ్లలో ప్రపంచానికి దానంగా ఇచ్చిన మొత్తం 832 బిలియన్ డాలర్లుగా లెక్క తేల్చారు.