Election Commission Of India: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ గా సాగిన బీహార్ ఎన్నికల ఫలితం మరికొద్ది గంటల్లో వెల్లడి కాబోతోంది.. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు బీహార్ ఫలితం గురించి అత్యంత ఆసక్తికరంగా చూస్తున్నాయి.. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తమ ఫలితాన్ని వెల్లడించాయి. విజయంపై ఎన్డీఏ కూటమి పూర్తి విశ్వాసంతో ఉంది. మరోవైపు అద్భుతం జరుగుతుందని మహా ఘట్ బంధన్ అంచనా వేస్తోంది.. రెండు కూటములకు సంబంధించిన నాయకులు విజయంపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు.
మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.. వాస్తవానికి ఎన్నికల సంఘం ఇలాంటి ప్రకటన చేస్తుందని రాజకీయ పార్టీలు ముఖ్యంగా మహా ఘట్ బంధన్ కూటమి అసలు ఊహించలేదు. ఎందుకంటే ఎన్నికల సంఘం చేసిన ప్రకటన అటువంటిది కాబట్టి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 67.13 పోలింగ్ శాతం నమోదయిందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 1951 నుంచి పోసి చూస్తే ఇదే అధికమని ఎన్నికల సంఘం వెల్లడించింది. బీహార్ రాష్ట్రంలోని 38 జిల్లాలో ఎక్కడా కూడా రీపోల్ కోసం అప్పిల్స్ రాలేదని ప్రకటించింది. వాస్తవానికి ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని.. ఈవీఎంలు.. ఇతర యంత్రాలను ఎన్డీఏ కూటమి వేరే మార్గంలోకి మళ్లించిందని.. కాంగ్రెస్ కూటమి ఆరోపించింది. కానీ ఇంతవరకు కూడా ఎన్నికల సంఘానికి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేదు.
బీహార్ రాష్ట్రంలో మొత్తం ఏడు కోట్ల 45 లక్షల 26వేల 858 మంది ఓటర్ల తో ఎన్నికల సంఘం తుది జాబితా విడుదల చేసింది. ఎక్కడ కూడా ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ కూటమి అప్పీల్ చేయలేదు. దీంతో రేపు ఉదయం ఎన్ని గంటల నుంచి కౌంటింగ్ ను ఎన్నికల సంఘం మొదలు పెడుతుంది. దీనికోసం ఏకంగా 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు ఫలితాల సరళిని విడుదల చేయడానికి ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ఇంతవరకు కాంగ్రెస్ కూటమి ఒక మాట కూడా మాట్లాడలేదు.