బీహార్‌‌ ఎన్నికలు: కాంగ్రెస్‌ బలం ఎంత?

మరొకొద్ది రోజుల్లో బీహార్‌‌ ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కూటమిలుగా ఏర్పడి విజయం సాధించాలని తలిచాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ మాత్రం మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఆర్జేడీతో మహాకూటమి ఏర్పాటు చేసింది. ఈ కూటమికి ఆర్జేడీనే నేతృత్వం వహిస్తోంది. మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ఇప్పటికే ప్రకటించారు కూడా. Also Read: కరోనా వేళ ‘ఇ-కామర్స్ ’పండుగ..ఇండియాలో ఇన్ని కోట్ల […]

Written By: NARESH, Updated On : October 23, 2020 9:57 am
Follow us on

CongressFlag

మరొకొద్ది రోజుల్లో బీహార్‌‌ ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కూటమిలుగా ఏర్పడి విజయం సాధించాలని తలిచాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ మాత్రం మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఆర్జేడీతో మహాకూటమి ఏర్పాటు చేసింది. ఈ కూటమికి ఆర్జేడీనే నేతృత్వం వహిస్తోంది. మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ఇప్పటికే ప్రకటించారు కూడా.

Also Read: కరోనా వేళ ‘ఇ-కామర్స్ ’పండుగ..ఇండియాలో ఇన్ని కోట్ల బిజినెస్?

ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఓడించి దేశంలో కాంగ్రెస్‌ బలాన్ని చాటాలని ఆలోచనలో ఉంది ఏఐసీసీ. అందుకే.. కలిసివచ్చే ప్రతీ పార్టీతోనూ కాంగ్రెస్‌ చేతులు కలుపుతోంది. మరోవైపు సీనియర్ నేత శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి రాజ్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇది కలిసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. శరద్ యాదవ్‌ను ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ యు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన నుంచి పార్టీని నితీష్ కుమార్ తీసుకోవడంతో శరద్ యాదవ్ సొంతంగా లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని పెట్టారు.

శరద్ యాదవ్ ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకుండాపోయారు. దీంతో ఆయన కూతురు సుభాషిణి కాంగ్రెస్‌లో చేరడంతో జేడీయూకు కొంత ఇబ్బందికరమైన పరిణామమని చెప్పకతప్పదు. దీంతోపాటు లోక్ జనశక్తి పార్టీకి చెందిన మాజీ ఎంపీ కాశీ పాండే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్జేపీ ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన తర్వాతే కాశీపాండే కాంగ్రెస్‌లో చేరారు. ఇలా ఇతర పార్టీల నేతల చేరికతో కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో గెలిచి చూపించాలని వలసలను కూడా కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తున్నట్లుగానే తెలుస్తోంది.

Also Read: జగన్ కు కేసీఆర్ కు అదే తేడా.. పవన్ సంచలన వ్యాఖ్యలు..?

ఇప్పటికే బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ 30 స్టార్ క్యాంపెయిన్ల జాబితానూ విడుదల చేసింది. సోనియా గాంధీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటుండగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వేర్వేరుగా వివిధ సభలు, ర్యాల్లీల్లో పాల్గొననున్నారు. శతృఘ్నసిన్హా సేవలను కూడా ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. ఫైనల్‌గా ఎన్డీయే కూటమికి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకుండా.. కలిసి వస్తున్న ప్రతీ అంశాన్ని ‘చే’జిక్కించుకోవాలనే చూస్తోంది.