https://oktelugu.com/

మధుమేహంతో బాధ పడుతున్నారా.. ఈ జాగ్రత్తలతో షుగర్ కు చెక్..?

ఈ మధ్య కాలంలో భారత్ తో పాటు ప్రపంచ దేశాల్లో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎక్కువమంది షుగర్ బారిన పడటానికి కారణమవుతున్నాయి. అయితే వైద్యులు మధుమేహ రోగులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మధుమేహ రోగులు ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని.. సాధారణ వ్యాయామాలతో పోలిస్తే ఏరోబిక్ వ్యాయామాలు చేయడం మరీ మంచిదని చెబుతున్నారు. Also Read: ‘కాళరాత్రి అమ్మవారు’గా ఏడవ రోజు దర్శనం..! ప్రతిరోజూ వ్యాయామం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 23, 2020 / 08:48 AM IST
    Follow us on


    ఈ మధ్య కాలంలో భారత్ తో పాటు ప్రపంచ దేశాల్లో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎక్కువమంది షుగర్ బారిన పడటానికి కారణమవుతున్నాయి. అయితే వైద్యులు మధుమేహ రోగులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మధుమేహ రోగులు ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని.. సాధారణ వ్యాయామాలతో పోలిస్తే ఏరోబిక్ వ్యాయామాలు చేయడం మరీ మంచిదని చెబుతున్నారు.

    Also Read: ‘కాళరాత్రి అమ్మవారు’గా ఏడవ రోజు దర్శనం..!

    ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని.. సరైన ఆహార నియమాలు పాటిస్తూ మందులు తీసుకునేవారిలో గ్లూకోజ్ నియంత్రణలో ఉన్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మధుమేహ రోగులు రోజులో వీలైనంత ఎక్కువ సమయం నడవటానికి ప్రాధాన్యత ఇవ్వాలని అలా చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని వీలైతే రెండు గంటల కంటే ఎక్కువ నడవాలని.. నడక వల్ల గుండెజబ్బు ముప్పు తగ్గుతుందని తెలిపారు.

    ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల చాలామంది షుగర్ బారిన పడతారనే సంగతి తెలిసిందే. ఈత, సైకిల్ తొక్కడం, పరిగెత్తడం లాంటి వ్యాయామాలు ఇన్సులిన్ సమర్థవంతంగా పని చేసేలా చేస్తాయి. డయాబెటిస్ రోగులు వ్యాయామం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని వ్యాయామం చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

    Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అందుబాటులోకి ఆ సేవలు..?

    వ్యాయామం చేసేముందు షుగర్ లెవెల్ ను తప్పనిసరిగా పరీక్షించుకోవాలి. శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ స్థిరంగా ఉన్నాయో లేదో పరిశీలించి అప్పుడు వ్యాయామాన్ని ప్రారంభించాలి. ఈ జాగ్రత్తలు పాటిసే మధుమేహానికి సులువుగానే చెక్ పెట్టవచ్చని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.