https://oktelugu.com/

చంద్రబాబు సైడ్‌.. చినబాబుకే స్టీరింగ్..

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన టీడీపీ అధినేత చంద్రబాబును వయోభారం వేధిస్తోంది. పార్టీలో సెకండ్‌ లీడర్‌‌ అంటూ ఎవరూ లేకపోవడంతో మథనపడుతున్నారట. ప్రస్తుతం ఏడు పదుల వయసులో ఉన్న బాబు.. 25 ఏళ్ల పాటు పార్టీని తనదైన శైలిలో పరుగులు పెట్టించారు. అందుకే.. పార్టీ కొత్త జవసత్వాల కోసం వేట సాగిస్తోంది. అందుకే ఇప్పుడు పెద్ద బాబు కాస్త.. చినబాబు మీద దృష్టి పెట్టారట. ఎంతవెతికినా ప్రత్యామ్నాయం దొరకకపోవడంతో చివరికి చినబాబే దిక్కయ్యారని రాజకీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 / 09:31 AM IST
    Follow us on

    2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన టీడీపీ అధినేత చంద్రబాబును వయోభారం వేధిస్తోంది. పార్టీలో సెకండ్‌ లీడర్‌‌ అంటూ ఎవరూ లేకపోవడంతో మథనపడుతున్నారట. ప్రస్తుతం ఏడు పదుల వయసులో ఉన్న బాబు.. 25 ఏళ్ల పాటు పార్టీని తనదైన శైలిలో పరుగులు పెట్టించారు. అందుకే.. పార్టీ కొత్త జవసత్వాల కోసం వేట సాగిస్తోంది. అందుకే ఇప్పుడు పెద్ద బాబు కాస్త.. చినబాబు మీద దృష్టి పెట్టారట. ఎంతవెతికినా ప్రత్యామ్నాయం దొరకకపోవడంతో చివరికి చినబాబే దిక్కయ్యారని రాజకీయ వర్గాల్లో టాక్‌.

    Also Read: జగన్ కు కేసీఆర్ కు అదే తేడా.. పవన్ సంచలన వ్యాఖ్యలు..?

    నటసామ్రాట్‌ ఎన్టీఆర్‌‌ టీడీపీ స్థాపించి నాలుగు పదుల వయసు వస్తోంది. ఆది నుంచీ ఎన్టీఆర్‌‌ పార్టీని నడిపించగా.. ఆ తర్వాత చంద్రబాబు పార్టీకి పెద్ద దిక్కయ్యారు. ఇన్నాళ్లు పార్టీని నడిపించిన బాబుకు.. ఇప్పుడు పార్టీ వ్యవహారాలు చూడడం భారం అవుతోంది. అందుకే.. ఇన్నాళ్లు సెకండ్‌ లీడర్‌‌ కోసం వెతికారు. కానీ.. ఎవరూ కనిపించ లేదు. కరోనా కారణంగా గత ఏడు నెలలుగా చంద్రబాబు తెరవెనుక రాజకీయాలే నడిపిస్తున్నారు.

    రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా చంద్రబాబు కనీసం ఏపీలో అడుగుపెట్టలేదు. హైదరాబాద్‌ పరిమితమై జూమ్‌ మీటింగ్‌లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో తమ్ముళ్ల నుంచి బాబుకు ఓ డిమాండ్ వినిపించింది. అదేంటంటే.. ‘మీరు రాకున్నా.. చినబాబును అయినా పంపించండి’ అంటూ..! దీంతో పార్టీని లోకేష్‌ చేతిలో పెట్టాలనుకుంటున్న చంద్రబాబుకు కార్యకర్తల పిలుపు బూస్టింగ్‌లా మారిపోయింది. బాబు కూడా తమ్ముళ్ల నుంచి ఈ పిలుపుకోసమే ఎదురుచూశారు. అందులో భాగంగా తెరవెనుక ఆయన ఉండి.. తన కొడుకును ముందు పెడుతున్నారు.

    టీడీపీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ఆ స్థాయిలో ఆయన నిర్ణయం తీసుకున్నాక ఏ క్యాడర్‌‌ అయినా సహకరించాల్సిందే. మరి ఇప్పుడు లోకేష్‌కి అవకాశం ఇచ్చేందుకు బాబు పూర్తిగా సైడ్‌ అయిపోయారు. ఇక చినబాబు అరంగేట్రంతో సీనియర్‌‌ లీడర్లకు కూడా రెస్ట్‌ దొరికే పరిస్థితులే రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర కమిటీలు, దాని అధ్యక్షుడు కూడా లోకేష్ బాటలోనే సాగాల్సి ఉంటుంది. అలా ఇక నుంచి చినబాబు నాయకత్వంలోనే పార్టీ ముందుకు సాగుతుంది. ఇందుకు సంకేతంగా తాజాగా తెలుగు మహిళా విభాగం ప్రతినిధుల ప్రమాణ స్వీకారానికి చినబాబే నాయకత్వం వహించారు. తన సారథ్యంలోనే మొత్తం నడిపించారు. ఎప్పుడూ బాబు అధ్యక్షతన జరిగే కార్యక్రమాలకు.. చినబాబే అధ్యక్ష స్థానం అలంకరించేశారు.

    Also Read: కరోనా వేళ ‘ఇ-కామర్స్ ’పండుగ..ఇండియాలో ఇన్ని కోట్ల బిజినెస్?

    అదేతీరుగా.. అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి హాజరై సంఘీభావం ప్రకటించారు. పార్టీ పెద్దల పరామర్శలకు కూడా వెళ్తున్నారు. అచ్చెన్నాయుడు, జేసీ దివాకరరెడ్డి అరెస్ట్ అయినపుడు వారి ఇళ్లకు వెళ్లి మాట్లాడింది లోకేష్ బాబే. అంతేకాదు.. ‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీకు న్యాయం చేస్తాను. టికెట్లు ఇస్తాను’ అంటూ అప్పుడే పెద్ద పెద్ద హామీలే ఇస్తున్నాడు. మరి ఈ జూనియర్‌‌ బాబు పార్టీని ఏ మేరకు నడిపిస్తాడు..? వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఏపాటి పోటీనిస్తారో కాలమే నిర్ణయించాలి మరి.