Bihar Counting: బీహార్ రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన ఎన్నికలు చివరికి ఎన్డీఏ కూటమిని విజేతను చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ.. రకరకాల ఆరోపణలు చేసిన బీహార్ ప్రజలు వాటిని పట్టించుకోలేదు. అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేశారు. తద్వారా నితీష్ కుమార్, నరేంద్ర మోడీ నాయకత్వానికి మరోసారి జై కొట్టారు.. వాస్తవానికి బీహార్ ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ ఇలా వస్తుందని అంచనా వేయలేదు. ఆర్జెడి అసలు ఊహించలేదు. బీహార్ లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ అంశాల గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి.
1.బీహార్లో గనక అధికారంలోకి వస్తే తేజస్వి యాదవ్ ఎం జి టి నుంచి ముఖ్యమంత్రి అయ్యేవాడు. వాస్తవానికి అతడు ఒక స్కూల్ డ్రాప్ అవుట్. అత్యంత అవినీతికర కుటుంబం నుంచి అతడు వచ్చాడు. అతని కుటుంబం కులంపరంగా.. మతంపరంగా బీహార్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మాఫియా రాజ్ అనే వ్యవస్థను విజయవంతంగా అమలు చేసింది. బీహార్ ప్రజలు అత్యంత తెలివిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఆ అవినీతికర కుటుంబాన్ని అధికారానికి దూరంగా పెట్టారు.
2.వాస్తవానికి నితీష్ కుమార్ అవినీతికి పాల్పడిన వ్యక్తి కాదు. అతడికి వారసత్వం కూడా లేదు. అయితే అవకాశవాదిగా అతడికి పేరు ఉంది.. అలాగని అతడు బిజెపితో చిరకాల ఉంటాడని కాదు.. అయితే ఇక్కడ బీహార్ ప్రజలు ఆర్జెడిని కేవలం 55 నుంచి 60 సీట్ల వరకే పరిమితం చేశారు. ఇది బీహార్ కు ఆరోగ్యకరం. దేశానికి మరింత ఆరోగ్యకరం.
3.జెడియు లార్జెస్ట్ సీట్లు సాధించిన పార్టీగా ఉండవచ్చు. బిజెపి కూడా భారీగానే స్థానాలు సాధించింది కాబట్టి.. తన పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేదు. మరోవైపు కేంద్ర మంత్రిగా వెళ్లడానికి నితీష్ కుమార్ ఏ మాత్రం ఆసక్తిగా లేడు. ఇదే విషయాన్ని అతడు అనేక సందర్భాల్లో చెప్పాడు.
4.ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ అనే పార్టీ పత్తా లేకుండా పోయింది. తద్వారా పొలిటికల్ బ్రోకర్లకు రాష్ట్రంలో చోటు లేదని బీహార్ ప్రజలు నిరూపించారు. బీహార్ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు సమాజానికి చాలా మంచిది. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ కు వివిధ రాజకీయ పార్టీలు అనవసరమైన హైప్ ఇచ్చాయి. వందల కోట్లు దార పోశాయి. ఈ తీర్పు ప్రతి రాజకీయ పార్టీకి ఒక పాఠం కావాలి.
5.వామపక్ష భావజాలం ఉన్న పార్టీలు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. వారి పనికిమాలిన దేశ వ్యతిరేక విధానాలను బీహార్ ప్రజలు ఎడమ కాలు చెప్పుతో కొట్టినట్టు వ్యతిరేకించారు.
6.వాస్తవానికి బీహార్ అనేది బీమారి రాష్ట్రం. అలా అవడానికి ప్రధాన బాధ్యత తీసుకోవాల్సింది. తాలు ప్రసాద్ యాదవ్ కుటుంబం. ఒకవేళ ఎం జి టి అధికారంలోకి వస్తే మళ్లీ మాఫియా, క్రైమ్ జడలు విప్పేది. ఇది యూపీలో అఖిలేష్ యాదవ్ పార్టీకి బలం ఇచ్చేది. తద్వారా దేశానికి తీవ్రమైన నష్టం కలిగేది.
7.రాహుల్ గాంధీ గనుక ఓటు చోరీ, ఎస్ ఐ ఆర్ కు మాత్రమే పరిమితం కాకుండా ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. బీహార్ సమస్యలను ఆయన ప్రస్తావించలేదు. పైగా బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ఒక స్టంట్ లాగా మార్చాడు.
8.బీహార్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఈసారి అద్భుతంగా పనిచేసింది. ముఖ్యంగా లక్షలలో ఉన్న దొంగ ఓట్లను తొలగించింది. అద్భుతంగా ప్రక్షాళన చేసింది. అది ఒక రకంగా ఎన్ డి ఏ కూటమికి ఉపయోగపడింది.
9.బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అధికారం దక్కడం వల్ల అక్కడి ప్రజలతో పాటు జంతువులు కూడా సంతోషంగా ఉన్నాయి. ఎందుకంటే తాము తినే దాణా ను తినే మనుషులు అధికారానికి దూరంగా ఉండిపోయారు.
10.రాహుల్ గాంధీ ఈ ఎన్నికల ఫలితంతోనైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఉద్యమం వస్తుందనే లేకి వ్యాఖ్యలు మానుకోవాలి. జార్జ్ సోరోస్ అడుగులకు మడుగులు వత్తకుండా ఉండాలి. డీప్ స్టేట్ కుట్రలకు అనుగుణంగా పనిచేయకుండా ఉండాలి. పనికిమాలిన విధానాలను పక్కనపెట్టి.. దేశానికి అనుకూలంగా మాట్లాడాలి. ముఖ్యంగా ఆర్మీ విషయంలో కూడా రాహుల్ జాగ్రత్తగా ఉండాలి. తన లేకి మనస్తత్వంతో వ్యాఖ్యలు చేస్తే ఇదిగో ఫలితాలు ఇదే విధంగా ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయి. వీటిని కొంతమంది ఏకీభవించవచ్చు.. మరి కొంతమంది ఏకీభవించకపోవచ్చు. అంతిమంగా మాత్రం బీహార్ గెలిచింది. అన్నింటికీ మించి దేశాన్ని ఆరోగ్యంగా ఉంచింది. బీమారి రాష్ట్రం అయినప్పటికీ.. ఎంతోకొంత తన బీమారిని తగ్గించుకునే ప్రయత్నం చేసింది. శభాష్ బీహార్ ఓటర్లారా..