Bihar CM oath ceremony 2025: బీహార్( Bihar) ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కేంద్ర పెద్దలు పిలవలేదా? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సైతం ఆహ్వానించలేదా? లేకుంటే ఆహ్వానిస్తే పవన్ వెళ్లలేదా? ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత టిడిపి తో పాటు జనసేన సైతం ఎన్డీఏలో కీలక భాగస్వామి. అటు తరువాత జరిగిన అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లారు. కానీ బీహార్ విషయానికి వచ్చేసరికి మాత్రం పవన్ వెళ్లలేదు. టిడిపి తరఫున నారా లోకేష్ ప్రచారానికి వెళ్లారు. బీహార్ లో ఎన్ డి ఏ గెలిచింది. నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరవుతారు. అయితే ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ కు ఆహ్వానం అందింది. అయితే పవన్ కళ్యాణ్ ను పిలవలేదా అనేది ఇప్పుడు ప్రశ్న.
Also Read: సీఎంగా ప్రమాణ స్వీకారం కాకముందే ఎమ్మెల్యేలకు నితీష్ కుమార్ బంపర్ గిఫ్ట్.. మెజారిటీ ఉన్న ఎందుకిలా?
ఆ రెండు పార్టీల కలయిక వెనుక..
ఏపీలో( Andhra Pradesh) టీడీపీ కూటమి గెలవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. కూటమి కట్టడానికి కూడా ఆయనే కారణం. రాజకీయ అంశాలతో ఎన్డీఏకు తెలుగుదేశం పార్టీ దూరమైంది. బిజెపితో ఆ పార్టీ చెలిమి చేసేందుకు చేసిన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చొరవ చూపి తెలుగుదేశం పార్టీని బిజెపికి దగ్గర చేశారు. అలా ఆ మూడు పార్టీలు ఒకటయ్యాయి. బలమైన పార్టీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాయి. జనసేన అయితే శత శాతం విజయం సాధించింది. జాతీయ స్థాయిలో సైతం పవన్ ప్రభావం పెరిగింది. దీంతో బిజెపి సైతం పవన్ కళ్యాణ్ కు ఎనలేని ప్రాధాన్యం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీఏకు మద్దతుగా పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పంపేది. అయితే ఇప్పుడు బీహార్ విషయంలో ఏం జరిగింది అనేది మాత్రం తెలియడం లేదు.
Also Read: చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సలహా!
ప్రత్యేక వ్యూహంతోనే?
పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ఇటీవల పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెట్టారు. సినిమా షూటింగ్ లు కూడా లేవు. ఆయన నిత్యం సచివాలయానికి వచ్చి సమీక్షలు జరుపుతున్నారు. తన శాఖల ప్రగతిపై దృష్టి పెట్టారు. అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి దిగారు పవన్ కళ్యాణ్. చివరకు తమిళనాడులో బిజెపి అనుబంధ సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సైతం హాజరయ్యారు. అటువంటి పవన్ కళ్యాణ్ కు బీహార్ ఎన్నికల ప్రచారానికి పిలవక పోవడమా అనేది ఒక ప్రశ్న. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నింటికీ ఆహ్వానాలు అందాయి. పవన్ కళ్యాణ్ కు సైతం ఆహ్వానించి ఉంటారు. ఏదో కారణాలతో ఆయన వెళ్ళలేదు. బీహార్ లో ఎన్డీఏ గెలిచేసరికి కూటమి తరుపున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఏపీ తరఫున సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ హాజరవుతున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం లేదా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అయితే కచ్చితంగా ఆయనకు ఆహ్వానం ఉంటుందని.. కానీ హాజరు కాకపోవడం వెనుక ఏదో ఒక వ్యూహం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.