Nitish Kumar: నితీష్ కుమార్ బీహార్ రాష్ట్ర చరిత్రలో సుదీర్ఘకాలం పరిపాలించిన ముఖ్యమంత్రి.. 19 సంవత్సరాల పాటు ఆయన బీహార్ రాష్ట్రాన్ని పరిపాలించారు.. అవకాశవాద రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు.. అవసరానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు ఆయన ప్లేట్ ఫిరాయిస్తారు. తన ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడితే వెంటనే కొత్త రాగం అందుకుంటారు. తనని విమర్శించే వారిని పట్టించుకోకుండా.. తనదైన ధోరణి ప్రదర్శిస్తారు. సమకాలీన రాజకీయాల్లో ఈ తరహా ఊసరవెల్లి పాత్ర పోషించిన నాయకుడు మరొకరు లేరంటే నితీష్ ఎత్తుగడలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
నితీష్ కుమార్ నవంబర్ 20న బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ కూటమి నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఇటీవల బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 202 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది.. ఇప్పటికిప్పుడు ఎన్డీఏ కూటమికి బీహార్ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగని నితీష్ కుమార్ పార్టీకి కూడా పెద్దగా ఒడిదుడుకులు లేవు. బిజెపి బంపర్ స్థానాలను సాధించింది. నితీష్ కుమార్ పార్టీ కూడా అద్భుతమైన స్థానాలను అందుకుంది. భాగస్వామ్య పార్టీలు కూడా బీభత్సంగాస్థానాలను సాధించాయి.
ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ ఎమ్మెల్యేలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అలాగని ఇదేమి ప్లేట్ ఫిరాయించే విషయం కాదు. బిజెపికి వ్యతిరేకంగా కూటమికట్టి ప్రభుత్వాన్ని పరిపాలించే సందర్భం కూడా కాదు. బీహార్ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 243 మంది ఎమ్మెల్యేలకు పాట్నాలోని దరోగా రాయ్ పాత్ ప్రాంతంలో నిర్మించిన 181 అధునాతన డూప్లెక్స్ గృహాల నిర్మాణం పూర్తయింది. అంతకుముందు 62 బంగారాలు ఉండేవి. వీటికి అందనంగా 181 గృహాలను నిర్మించారు. 44 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మించారు. ఈ భవనాలు మొత్తం ఇంద్ర భవనాల మాదిరిగా కనిపిస్తున్నాయి. ఒక యూనిట్ 3693 నుంచి 3700 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఫోర్ బెడ్ రూమ్ కెపాసిటీతో నిర్మించారు. ఇందులో అద్భుతమైన సౌకర్యాలను కల్పించారు.. లేఅవుట్ కూడా అద్భుతంగా కనిపిస్తోంది.
ఈ గృహాల గ్రౌండ్ ఫ్లోర్లో ఎమ్మెల్యేలకు అవసరమైన అతిథి గృహం, పిఎ రూమ్, ఆఫీస్ రూమ్, కిచెన్, మొదటి అంతస్తులో మాస్టర్ బెడ్ రూమ్ సహా మూడు గదులు.. ఇందులో ఆరు టాయిలెట్లు ఉన్నాయి. అన్ని గదుల్లో కూడా అద్భుతమైన ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు హాస్టల్, క్యాంటీన్, కమ్యూనిటీ సెంటర్ వంటి సౌకర్యాలు కూడా ఇందులో కల్పించారు. మౌలిక వసతులకు పెద్దపీట వేశారు. వాన నీటిని సేకరించినందుకు పెద్దవ్యవస్థ ఏర్పాటు చేశారు.. ఆ నీటిని శుద్ధిచేసి తోటలను పెంచబోతున్నారు. విద్యుత్ ఆదా చేసి ఎస్ఈడి వీధి దీపాలకు వినియోగిస్తున్నారు. క్యాంపస్ లో పచ్చదనాన్ని పెంపొందించడానికి భారీగా మొక్కలను నాటారు. అంతేకాదు పర్యావరణహితమైన చర్యలు మిగతా రాష్ట్రాల వారికి అత్యంత ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒక్కో గృహానికి ముందు ఎమ్మెల్యే పేరు, నియోజకవర్గ సంఖ్యను జత చేశారు.