Bihar Cm Nithin Car : బీహార్ సీఎం కొన్న కారు ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

బీహార్ సీఎం నితీశ్ ఈవీ కారు కొనుగోలు చేశాడు. ఈ కారు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండడంతో పాటు మంచి ఫీచర్స్ ను కలిగి ఉంది. ఇంతకీ ఆ కారు విశేషాల్లోకి వెళితే..

Written By: Chai Muchhata, Updated On : February 25, 2024 11:03 am

Bihar cm Nithish car

Follow us on

Bihar Cm Nithin Car :  అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం.. వాతావరణ కాలుష్యం కారణంగా పెట్రోల్, డీజిల్ కార్లు ఇక తగ్గే అవకాశం కనిపిస్తోంది. వీటికి ప్రత్యామ్నాయంగా బయోడీజిల్, విద్యుత్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. 2030 నాటికి దేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం అత్యధికంగా పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈవీ ల అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. వీటిపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఇప్పటికే ప్రజాప్రతినిధులు ఎలక్ట్రిక్ కార్లపై అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా బీహార్ సీఎం నితీశ్ ఈవీ కారు కొనుగోలు చేశాడు. ఈ కారు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండడంతో పాటు మంచి ఫీచర్స్ ను కలిగి ఉంది. ఇంతకీ ఆ కారు విశేషాల్లోకి వెళితే..

ఒకప్పుడు ప్రజాప్రతినిధులు అంబాసిడర్, స్కార్పియో వంటి కార్లను ఉపయోగించేవారు. కానీ లేటేస్టుగా ఎలక్ట్రిక్ కార్లను వినియోగిస్తున్నారు. నితీశ్ కొన్న ఎలక్ట్రిక్ కారు హ్యుందాయ్ కంపెనీకి చెందినది. దీని పేరు ‘ఐయోనిక్ 5’. అత్యంత సక్సెస్ ఫుల్ అయిన ఈ కారు కు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. దీనిని ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులు సొంతం చేసుకున్నారు. తాజాగా బీహార్ సీఎం కొనుగోలు చేయడం ఆసక్తిగా మారింది.

ఐయోనిక్ 5.. 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు 12.3 డిజిటల్ ఇను స్ట్రుమెంట్ క్లస్టర్ అనే రెండు స్క్రీన్లు ఉన్నాయి. డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జర్, లెవెల్ 2, అడాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటివి ఉన్నాయి. ఈ కారు 72.6 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 631 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

ఎల్ట్రిక్ మోటార్ 214 బీహెచ్ పీ పవర్, 350 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే దీనిని సొంతం చేసుకోవాలంటే రూ.44.95 లక్షల ప్రారంభ ధరను వెచ్చించాల్సిందే. అయితే ఇది కియా ఈవీ 6 కారు కంటే తక్కువగా ఉండడం విశేషం. అలాగే ఈ కారు ఇప్పటి వరకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సొంతం చేసుకున్నాడు. మరికొంత మంది దీనిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత పెరిగింది.