బిచ్చమెత్తుకుని నామినేషన్ వేసి బరిలో దిగిన అభ్యర్థి.. ఎక్కడంటే..?

అతి త్వరలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే ప్రముఖ పార్టీల అభ్యర్థులంతా ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్లు ఆశించి అనుకోని కారణాల వల్ల టికెట్ పొందని వాళ్లు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అయితే బీహార్ లో ఒక వ్యక్తి నామినేషన్ దాఖలు చేయడానికి పడిన కష్టం మాత్రం అందరినీ ఆకర్షించడంతో పాటు ఇతరులతో పోలిస్తే అతనిని ప్రత్యేకంగా నిలిచేలా చేస్తోంది. సూర్యవత్స అనే వ్యక్తి కడు […]

Written By: Navya, Updated On : October 8, 2020 6:18 pm
Follow us on

అతి త్వరలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే ప్రముఖ పార్టీల అభ్యర్థులంతా ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్లు ఆశించి అనుకోని కారణాల వల్ల టికెట్ పొందని వాళ్లు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అయితే బీహార్ లో ఒక వ్యక్తి నామినేషన్ దాఖలు చేయడానికి పడిన కష్టం మాత్రం అందరినీ ఆకర్షించడంతో పాటు ఇతరులతో పోలిస్తే అతనిని ప్రత్యేకంగా నిలిచేలా చేస్తోంది.

సూర్యవత్స అనే వ్యక్తి కడు పేదవాడు. అయితే పేదవాడే అయినప్పటికీ అతనిలో సమాజం కోసం ఏదో చేయాలనే తపన మాత్రం పుష్కలంగా ఉంది. ఆ తపనే సూర్యవత్సకు ప్లురల్స్ పార్టీ తరపున జమయీ ప్రాంతంలోని ఝాఝా నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. సూర్యవత్సకు ప్రముఖ పార్టీ నుంచి టికెట్ అయితే దక్కింది కానీ అతని దగ్గర నామినేషన్ వేయడానికి చిల్లిగవ్వ కూడా లేదు.

ఎవరి దగ్గరైనా అప్పు చేసినా అతనికి తిరిగి చెల్లించే స్థోమత లేదు. దీంతో నామినేషన్ కోసం సూర్యవత్స బిచ్చమెత్తాడు. కాళ్లకు హవాయి చెప్పులతో సూర్యవత్స ఇంటింటికీ తిరిగి జోలె పట్టి బిచ్చమెత్తాడు. అలా సంపాదించిన డబ్బులతో నామినేషన్ వేసి ఎన్నికల్లో బరిలో నిలిచాడు. తప్పనిసరి పరిస్థితుల్లో బిచ్చమెత్తి నామినేషన్ వేయాల్సి వచ్చిందని సూర్యవత్స తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు.

తాను నామినేషన్ వేయడానికి సహాయసహకారాలు అందించిన ప్రజలు తనను గెలిపిస్తే మాత్రం తప్పకుండా వాళ్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. అతి సామాన్య జీవితం గడుపుతున్న సూర్యవత్స దగ్గర కేవలం రెండు జతల బట్టలు మాత్రమే ఉన్నాయంటే అతను ఎంతటి ధీన స్థితిలో జీవనం వెళ్లదీస్తున్నాడో సులువుగానే అర్థమవుతుంది. మరి అసెంబ్లి ఎన్నికల్లో సూర్యవత్స విజయం సాధిస్తాడో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.