బుక్కైన రఘురామ.. జగన్ ప్రతీకారం మొదలైందా?

ఢిల్లీలో మోడీనికి కలిసిన తెల్లారే ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఐటీ దాడులు జరగడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇది ఖచ్చితంగా సీఎం జగన్ స్కెచ్చేనని అనుమానిస్తున్నారు.. మోడీని ఒప్పించి రఘురామపై సీఎం జగన్ దాడులు చేయించారని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. కొద్దిరోజులుగా రఘురామకృష్ణంరాజు సొంతపార్టీపై విమర్శలు చేస్తూ పార్టీని ఇరుకునపెడుతున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం ఆయన విషయం పెద్దగా స్పందించిన దాఖలు లేవు. Also Read: న్యాయవ్యవస్థపై వైసీపీ యుద్ధం ప్రకటించిందా? అయితే తాజాగా రఘురామకు […]

Written By: NARESH, Updated On : October 8, 2020 7:51 pm
Follow us on

ఢిల్లీలో మోడీనికి కలిసిన తెల్లారే ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఐటీ దాడులు జరగడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇది ఖచ్చితంగా సీఎం జగన్ స్కెచ్చేనని అనుమానిస్తున్నారు.. మోడీని ఒప్పించి రఘురామపై సీఎం జగన్ దాడులు చేయించారని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. కొద్దిరోజులుగా రఘురామకృష్ణంరాజు సొంతపార్టీపై విమర్శలు చేస్తూ పార్టీని ఇరుకునపెడుతున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం ఆయన విషయం పెద్దగా స్పందించిన దాఖలు లేవు.

Also Read: న్యాయవ్యవస్థపై వైసీపీ యుద్ధం ప్రకటించిందా?

అయితే తాజాగా రఘురామకు చెందిన కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించడం వెనుక జగన్ హస్తం ఉందనే టాక్ విన్పిస్తోంది. వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజు కిందటి ఎన్నికల్లో గెలిచారు. అయితే ఆయన తాను సొంత ఇమేజ్ తోనే గెలిచానని.. జగనే తన వద్దకు వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని చెబుతూ వచ్చారు. దీంతో ఆగకుండా జగన్ రాజకీయంగా తీసుకునే ప్రతివిషయంలో వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు.

ఈ నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం రఘురామకృష్ణంరాజు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలోనూ రఘురామదే పైచేయి అయింది. సీఎం జగన్ తోపాటు.. వైసీపీ నేతలను అందరినీ రఘురామకృష్ణ టార్గెట్ చేస్తూ ఇటీవల మీడియాలో మాట్లాడుతున్నారు. అయితే ఆయనపై సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇన్నిరోజులుగా సైలంట్ గా ఉన్న జగన్ అదునుచూసి రఘురామకృష్ణంరాజుకు గట్టిదెబ్బ కొట్టారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసిన తెల్లారే ఢిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక బృందం ఎంపీ రఘురామకు చెందిన కార్యాలయాలపై దాడులు చేయడం యాధృచ్చికం కాదనే మాట విన్పిస్తోంది.  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను చీట్‌ చేసిన కేసులో ఈ దాడులు జరుగుతున్నాయి. 826 కోట్ల రూపాయల లోన్‌ఫ్రాడ్‌ కేసులో సీబీఐ ఈ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌, ముంబైలోని ఆఫీసుల్లో ఉదయం నుంచి 11చోట్ల ఏకకాలంలో సీబీఐ సోదాలు చేపట్టింది. ఇండ్‌ భారత్‌ సహా 8 కంపెనీల డైరెక్టర్ల ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు.

Also Read: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. మధ్యలో పవన్‌..!

నిందితుల జాబితాలో రఘురామకృష్ణంరాజు, ఆయన భార్య రమాదేవి, కూతురు ప్రియ దర్శిని ఉన్నారు. ఎస్బీఐ, ఐఓబీ, పీఎన్బీ, అక్సీస్ కు చెందిన కన్సార్టియంను ఇండ్ భారత్ మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రఘురామ కృష్ణంరాజుతోపాటు ఇండ్‌ భారత్‌కు చెందిన 10మంది డైరెక్టర్లపై సీబీఐ గతనెలలోనే కేసు నమోదు చేయడం గమనార్హం.

అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘురామకృష్ణం రాజు అసలు తన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులే జరగలేదని.. మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్పితే అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. మరి దీనిపై ఐటీ శాఖ అధికారులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.