Ram Charan And Sandeep Reddy Vanga: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం బుచ్చి బాబు దర్శకత్వం లో ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు విరామం లేకుండా సాగిన ఈ మూవీ షూటింగ్, ఇప్పుడు కాస్త చిన్న బ్రేక్ తీసుకుంది. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి..చికిరి’ అనే పాట దేశంలోని మ్యూజిక్ లవర్స్ అందరినీ ఒక రేంజ్ లో అలరిస్తోంది. తెలుగు వెర్షన్ లో అప్పుడే 40 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. అదే విధంగా హిందీ వెర్షన్ నుండి 15 మిలియన్ వ్యూస్, మరియు ఇతర బాషల నుండి 6 మిలియన్ వ్యూస్, మొత్తం మీద 61 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ బ్లాక్ బస్టర్ సాంగ్. రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరో పాట సూపర్ హిట్ అయ్యినందుకు సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ బయటికి వచ్చేసాయి.. గెలిచేది ఆ పార్టీనే
ఇదంతా పక్కన పెడితే పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభం లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఏ సినిమా చేయబోతున్నాడు అనే విషయం పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. రామ్ చరణ్ తానూ భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ, అభిమానులకు ఒక చిన్న క్లూ అయితే ఇచ్చేసాడు. రీసెంట్ గానే వీళ్లిద్దరు ఇన్ స్టాగ్రామ్ లో ఒకరిని ఒకరు ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. ఇన్ని రోజులు లేనిది, సడన్ గా ఇప్పుడు ఎందుకు ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారంటే అందుకు కారణం వీళ్లిద్దరు త్వరలోనే కలిసి పనిచేయబోతున్నారు అనే అర్థం అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు.
సందీప్ వంగ(Sandeep Reddy Vanga) వద్ద ‘డెవిల్’ అనే స్క్రిప్ట్ ఉంది. ముందుగా ఈ స్క్రిప్ట్ ని ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రాసుకున్నాడు. కానీ రీసెంట్ గా వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు జరిగినప్పుడు డెవిల్ కాన్సెప్ట్ రామ్ చరణ్ కి చాలా నచ్చిందట. దీనిని డెవలప్ చేసి, ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేయమని సందీప్ వంగ కి చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం అయితే లేదు, రాబోయే రెండు మూడేళ్ళలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సందీప్ ఫోకస్ మొత్తం ప్రభాస్ తో చేయఁబోయే ‘స్పిరిట్’ మీదనే ఉంది. త్వరలోనే మెక్సికో లో షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రం లో చిరంజీవి ప్రభాస్ కి తండ్రి క్యారక్టర్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో ఒక రూమర్ వినిపిస్తోంది, ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి.