MLA Uma Shankar Ganesh: నర్సీపట్నం.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి పెట్టని కోట. గత ఎన్నికల్లో పెట్ల ఉమా శంకర్ గణేష్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సాదరుడు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ఓడించారు . పాతిక వేల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈసారి ఆయనకు టిక్కెట్ దక్కుతుందా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నర్సీపట్నం వైసీపీలో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో టికెట్ ఎవరికి దక్కుతుందా అన్నది తెలియాల్సి ఉంది.
ఉమా శంకర్ గణేష్ 2014 ఎన్నికల్లో సైతం పోటీ చేశారు. కేవలం 2000 ఓట్ల మెజారిటీతో అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు.అయినా ఉమా శంకర్ గణేష్ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించారు.2019 ఎన్నికల్లో రెండోసారి పోటీ చేశారు.ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అయ్యన్నను విభేదించి ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్యాసి పాత్రుడు భార్యకు డిసీసీబీ చైర్ పర్సన్ పదవి దక్కింది.దీంతో సన్యాసి పాత్రుడు లోకల్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వ్యతిరేకంగా ఒక వర్గాన్ని రూపొందించారు.అది అధిష్టానం దృష్టిలో పడినట్లు తెలుస్తోంది.అందుకే సన్యాసి పాత్రుడు భార్యను డిసిసిబి చైర్ పర్సన్ పదవి నుంచి తొలగించి.. కోలా గురువులకు అప్పగించారు.
అయితే ఈ పరిణామంతో ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ కు లైన్ క్లియర్ అయినట్లు టాక్ నడుస్తుంది. సన్యాసి పాత్రుడు పై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్లే పక్కకు తప్పించారని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో సోదరుడు అయ్యన్నను విభేదించి సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ నాయకత్వం ఆయనను పొమ్మనలేక ఒక పెడుతుండడంతో ఎటు వెళ్ళాలో తెలియక మదన పడుతున్నారు. సోదరుడు టిడిపి గూటికి చేరాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామం లోకల్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణష్ కు రిలీఫ్ ఇచ్చింది.