https://oktelugu.com/

జగన్‌, కేసీఆర్‌కు‌ ఎంతో తేడా.. ఇరు రాష్ట్రాల్లో సిచ్యువేషన్‌ ఇలా..

ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సీఎం.. ఒక్కో సీఎం పాలన ఒక్కోలా ఉంటుంది. అందరిదీ ఒకేవిధంగా ఉండాలన్న రూల్‌ ఏమీ లేదు. ఎవరి ప్రత్యేకతలు వారివి. కేసీఆర్, వైఎస్‌ జగన్‌ ఇరు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. వీరి పాలనా మధ్య తప్పనిసరిగా తేడాలుంటాయి. ఇది చాలా రకాలుగానే ఉంది. తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక తరువాత సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉపఎన్నిక నాగార్జున సాగర్. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు బీజేపీ ద్వారా గట్టి దెబ్బ తగిలింది. ఆ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 30, 2021 / 01:46 PM IST
    Follow us on


    ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సీఎం.. ఒక్కో సీఎం పాలన ఒక్కోలా ఉంటుంది. అందరిదీ ఒకేవిధంగా ఉండాలన్న రూల్‌ ఏమీ లేదు. ఎవరి ప్రత్యేకతలు వారివి. కేసీఆర్, వైఎస్‌ జగన్‌ ఇరు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. వీరి పాలనా మధ్య తప్పనిసరిగా తేడాలుంటాయి. ఇది చాలా రకాలుగానే ఉంది. తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక తరువాత సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉపఎన్నిక నాగార్జున సాగర్. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు బీజేపీ ద్వారా గట్టి దెబ్బ తగిలింది. ఆ తరువాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిపత్యానికి బీజేపీ భారీగా గండి కొట్టింది. దాని తరువాత వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కుదేలైంది.

    ఆ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లు పట్టభద్రులు మాత్రమే కాబట్టి వాటిని సాధారణ ఎన్నికల కింద పరిగణించరు. ఇక ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగబోతోంది. దీన్ని కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇక్కడ ఆయన ప్లాన్ బీజేపీని దెబ్బకొట్టడం కంటే కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టడం ముఖ్యం. అయితే.. మరోవైపు బీజేపీ భయాన్ని సైతం తీసిపారేయలేం. వాస్తవానికి సాగర్‌‌లో గెలిస్తే టీఆర్ఎస్ గెలవాలి లేదా కాంగ్రెస్ గెలవాలి.

    సాగర్‌‌లో బీజేపీకి అంత సీన్‌లేదని నిపుణులు చెప్తున్న మాట. మరి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కేసీఆర్‌‌కు కాంగ్రెస్‌ అంటే భయమా..? లేక బీజేపీ అంటేనా..? అనేది తెలియకుండా ఉంది. ఉప ఎన్నికపై పార్టీ నాయకులతో మాట్లాడిన కేసీఆర్ దుబ్బాకలో తాను ప్రచారానికి వెళ్లకపోవడం వల్లనే అక్కడ ఓడిపోయామని, అందుకే సాగర్‌‌లో ప్రచారానికి తానూ, కేటీఆర్ వస్తామని చెప్పారు. అంటే తండ్రీకొడుకులు అక్కడ ప్రచారం చేస్తారన్నమాట. సాధారణంగా ఉప ఎన్నికలను అధికార పార్టీలు అంతగా పట్టించుకోవు. అందుకే.. ప్రచారానికి ముఖ్యమంత్రులు వెళ్లరు. కేవలం ప్లాన్ చెప్పి వదిలేస్తారు. మంత్రులకు, పార్టీ ముఖ్యులకు బాధ్యతలు అప్పగిస్తారు.

    ఇక ఏపీలో ఈమధ్య పంచాయతీ ఎన్నికల తరువాత మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఓ పక్క అమరావతి ఉద్యమం, మరోపక్క విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం, మరోపక్క మూడు రాజధానుల వ్యవహారం.. ఈ కారణంగా ఈ ఎన్నికలను టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు రెఫరెండంగా ప్రచారం చేశాయి. జగన్ పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ఓ వర్గం మీడియా కోడైకూసింది. అయినా జగన్ ఓటమి ఎదురవుతుందని ఎక్కడా భయపడలేదు. ఎన్నికల్లో ఎక్కడా ప్రచారమే చేయలేదు. వైసీపీని గెలిపించాలని వ్యక్తిగతంగానూ ప్రజలకు విజ్ఞప్తి చేయలేదు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులంతా తిరిగి చమటోడ్చారు. కానీ.. వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో సునామీ సృష్టించింది.

    మరి ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్‌‌ ఒక్క ఉప ఎన్నిక కోసం చెమటోడ్చాల్సి వస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొడుకు కేటీఆర్‌‌ ప్రచారం రంగంలోకి దిగాల్సి వస్తోంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఇప్పుడు ప్రతిపక్షాలు అంత బలంగా లేవు. టీడీపీని ప్రజలే స్వయానా నమ్మలేకపోతున్నారు. బీజేపీ–జనసేన పోరాడుతున్నా పెద్దగా ఫలితాలు రావడం లేదు. దీంతో జగన్‌ తాపీగా ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికపై కూడా ఆయనలో పెద్దగా టెన్షన్‌ కనిపించడం లేదు. కానీ.. కేసీఆర్‌‌ను మాత్రం సాగర్‌‌ ఉప ఎన్నిక కలవరపెడుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్