Homeజాతీయ వార్తలుఎన్నికల వేళ మమతకు ఎందుకీ పరిస్థితి..?

ఎన్నికల వేళ మమతకు ఎందుకీ పరిస్థితి..?

Mamata
పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం మమత బెనర్జీ పరిస్థితి దయనీయంగా తయారైంది. మరికొద్ది రోజుల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ క్రమంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు మమత బెనర్జీ. రోజుకో ముఖ్య నేత పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. మరోవైపు ఈసారి బెంగాల్‌లో కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ పట్టుదలతో ఉంది. అందుకే.. అక్కడ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగిస్తోంది.

Also Read: బ్యాలన్స్‌ తప్పుతున్న బాబు

ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి మమతకు నమ్మకమైన నేతలే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. సానుభూతితో తాను ఇచ్చిన పదవులను కూడా త్యజించి బైబై చెబుతున్నారు. అయితే.. ఇదంతా మమత బెనర్జీ మీద కోపమా..? లేక బీజేపీ వేసిన వలకు చిక్కుకుంటున్నారా..? తెలియకుండా ఉంది. మొత్తంగా ఎన్నికలకు ముందు మమతకు గట్టి దెబ్బలే తగులుతున్నాయి. నా అనుకున్న వాళ్లే కాదని వెళ్లిపోతున్నారు. మొన్న సువేందు అధికారి తాజాగా దినిశ్ త్రివేది వీరంతా మమత బెనర్జీ నుంచి ఏదో ఒకరూపంలో లబ్ధిపొందిన వారే. కానీ.. ఎన్నికల సమయానికి హ్యాండిచ్చి వెళ్లిపోతుండటం దీదీలో దిగులు పెంచుతోంది. దినేశ్ త్రివేది సీనియర్ నేత. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి జనతాదళ్‌లో చేరారు. 1998లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. తృణమూల్ కాంగ్రెస్‌లో ఆయనకు ప్రాధాన్యత బాగానే ఇచ్చారు. 2019 ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలు కావడంతో మమత బెనర్జీ వెంటనే ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చారు.

ఇంకా ఏడాది కూడా గడవని పదవిని వదలి వెళ్లిపోవడం బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మమత బెనర్జీ కార్పొరేట్ శక్తుల్లో కూరుకుపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రధానంగా ప్రశాంత్ కిషోర్‌‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్‌‌ను మమత బెనర్జీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న నాటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మమత బెనర్జీ ఎక్కువగా ప్రశాంత్ కిషోర్ మీదనే ఆధారపడటం, సీనియర్ నేతల సలహాలు కూడా తీసుకోకపోవడమే ఇందుకు కారణాలుగా తెలుస్తున్నాయి.

Also Read: వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌

మమత బెనర్జీ పార్టీకి చీఫ్. ఆమె నిర్ణయమే ఫైనల్. అయితే రెండు ఎన్నికల్లో మమత బెనర్జీ అలా చేయలేదు. పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకునే వారు. ఈసారి మాత్రం ఎవరి అభిప్రాయాలు మమతను లెక్కల్లోకి తీసుకోవడం లేదు. అభ్యర్థుల ఎంపికలోనూ ప్రశాంత్ కిషోర్‌‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతోనే సీనియర్ నేతల్లో అసహనం మొదలై పార్టీని వీడే వరకు పరిస్థితులు వచ్చాయని టాక్‌ నడుస్తోంది. మమత వైఖరి ఇంకా ఇలాగే కొనసాగితే మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే పరిస్థితులు లేకపోలేదని వినిపిస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular