Joe Biden: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చిచ్చు రేపుతోంది రష్యా, యుక్రెయిన్ యుద్ధం. ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాస్తా.. ఇతర దేశాల మధ్య అగ్గిని రాజేస్తోందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని దేశాలు రష్యా తీరును వ్యతిరేకిస్తుంటే.. ఇంకొన్ని దేశాలు మాత్రం మద్దతు తెలుపుతున్నాయి. ఇక మన ఇండియా లాంటి దేశం మాత్రం తటస్థంగా ఉండిపోతోంది.

అయితే అమెరికా మాత్రం తన విరోధి అయిన రష్యా కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టి ఆంక్షలు విధించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఇతర దేశాలతో మాట్లాడుతున్న బైడెన్.. ఇందులో భాగంగా ఈ నెల 25న పోలాండ్‌కు వెళ్లి యుద్ధం క్షేత్రం దగ్గరలో మకాం వేయనున్నట్టు తెలుస్తోంది. అక్కడ రష్యాకు కళ్లెం వేయడానికి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల అత్యున్నత స్థాయి మీటింగ్ లో పాల్గొని చర్చిస్తారని సమాచారం.
Also Read: అయిదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయే.. మోడీ సార్ వీర బాదుడు మొదలాయే
ఈ మీటింగ్‌ల ఇతర దేశాల నుంచి మద్దతును కూడగట్టి యుక్రెయిన్‌కు అండగా నిలవనున్నట్టు తెలుస్తోంది. ఇక పోలాండ్ కూడా మొదటి నుంచి రష్యాను వ్యతిరేకిస్తోంది. కాబట్టి ఈ మీటింగ్ యుక్రెయిన్‌కు పెద్ద లాభమే చేకూరుస్తుంది. అయితే తమతో కలిసి వచ్చే దేశాల గురించి మాట్లాడే క్రమంలో జో బైడెన్ ఇండియాపై కొన్ని కీలక వ్యాఖ్యలుచేశారు.
పాశ్చాత్య దేశాలలాగా ఇండియా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇప్పటి వరకు రష్యా మీద ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడాన్ని చూస్తుంటే.. రష్యాను వ్యతిరేకించే కూటమిలో భారత్ లేనట్టే అంటూ తేల్చి చెప్పేశారు. ఇండియా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవట్లేదని, క్వాడ్ సభ్య దేశాల్లో భారత్ తప్ప మిగిలిన జపాన్, ఆస్ట్రేలియా దేశాలు రష్యాపై వ్యతిరేకంగా ఉన్నాయంటూ చెబుతున్నారు.

అయితే క్వాడ్‌లో సభ్యత్వం ఉన్న దేశాలు రష్యా వ్యతిరేక కూటమిలో చేరుతుంటే.. భారత్ మాత్రం ఇందులో చేరకపోవడాన్ని జో బైడెన్ తప్పు బట్టారు. ఇక నాటో సభ్యత్వ దేశాలు చీలుతాయంటూ రష్యా చేసిన కామెంట్ల మీద కూడా జో బైడెన్ తప్పుబట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా నాటో దేశాలు అన్ని ఒకే స్టాండ్ మీద ఉన్నాయని, అన్నీ కలిసి రష్యాను వ్యతిరేకిస్తున్నాయంటూ చెబుతున్నారు. మరి జో బైడెన్ కామెంట్ల మీద భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడంలో రష్యా చేసిన పెద్ద తప్పేంటో తెలుసా..?
Recommended Video: