https://oktelugu.com/

అనుష్క అందుకే పెళ్లి చేసుకోవట్లేదట !

యోగా టీచర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ‘స్వీటీ అనుష్క‘ ఇప్పటికీ ఒక వెలుగు వెలిగిపోతుందంటే.. దానికి కారణం ఆమె క్యారెక్టరే. పెద్దగా యాక్టింగ్ రాకపోయినా.. తన మంచి మనసుతో దర్శకుల అభిమానాన్ని సంపాధించింది. దాంతో వరుస అవకాశాలు.. భారీ విజయాలు మధ్య అనుష్క కెరీర్ ఓ రేంజ్ కి వెళ్ళింది.. ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది కూడా. ఇంతవరకు బాగానే ఉన్నా.. అనుష్క పర్సనల్ లైఫ్.. ముఖ్యంగా ఆమె పెళ్లి […]

Written By:
  • admin
  • , Updated On : July 17, 2020 / 05:32 PM IST
    Follow us on


    యోగా టీచర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ‘స్వీటీ అనుష్క‘ ఇప్పటికీ ఒక వెలుగు వెలిగిపోతుందంటే.. దానికి కారణం ఆమె క్యారెక్టరే. పెద్దగా యాక్టింగ్ రాకపోయినా.. తన మంచి మనసుతో దర్శకుల అభిమానాన్ని సంపాధించింది. దాంతో వరుస అవకాశాలు.. భారీ విజయాలు మధ్య అనుష్క కెరీర్ ఓ రేంజ్ కి వెళ్ళింది.. ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది కూడా. ఇంతవరకు బాగానే ఉన్నా.. అనుష్క పర్సనల్ లైఫ్.. ముఖ్యంగా ఆమె పెళ్లి పై వచ్చే పుకార్లు.. దానికి తగ్గట్లే ఇప్పట్లో పెళ్లి గురించి కబురు చెప్పే ఉద్దేశ్యం లేనట్టు అనుష్క కనిపించడం.. మొత్తానికి అనుష్క వివాహం విషయంలో అనేక మార్లు రూమర్లు వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.

    నెట్‌ఫ్లిక్స్‌లో జాన్వీ కపూర్ కొత్త సినిమా.. రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

    ఆమె వివాహం చేసుకోబోయే వరుడు అంటూ ప్రభాస్ సహా ఇంకో యువ హీరో పేరు అలాగే ఓ సీనియర్ దర్శకుడి కొడుకు పేరు కూడా బాగా చర్చకు వచ్చినా వాటి పై అనుష్క ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ మధ్య ఎక్కువగా టాలీవుడ్ సీనియర్ దర్శకుడి కుమారుడితో అనుష్క వివాహమనేది దాదాపు ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది రూమర్స్ కి ఆజ్యం పోస్తున్నారు. నిజానికి ఆ దర్శకుడి కుమారుడికి ఒకసారి వివాహం కాగా, అనుష్క కోసమే అతను తన భార్య నుండి డైవర్స్ తీసుకున్నాడని కూడా రాతల రాయుళ్లు సృష్టించిన మరో గాసిప్ కూడా బాగానే హల్ చల్ చేస్తోంది.

    చిరు రేంజ్‌కు రెహమాన్‌ సరిపోతాడా?

    అయితే తాజాగా అనుష్క పెళ్లి పై తమిళ్ మీడియాలో మరొక గాసిప్ వైరల్ అయింది. అనుష్క, ప్రభాస్ లవ్ లో ఉన్నారని.. అయితే వారి ప్రేమను ప్రభాస్ తల్లి అంగీకరించట్లేదని.. అందుకే వాళ్ళు పెళ్లికి దూరంగా ఉంటున్నారని.. ఇంట్లో వారిని ముఖ్యంగా ప్రభాస్ అమ్మగారిని ఒప్పించాకే పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారని.. అందుకే అనుష్క పెళ్లి చేసుకోకుండా ప్రభాస్ కోసం ఎదురుచూస్తుందని ప్రస్తుతం కోలీవుడ్ లో ఓ వార్త బాగా వినిపిస్తోంది. గతంలో పుకార్ల కంటే బలంగా ఈ రూమర్ చక్కర్లు కొడుతుండటం విశేషం.