Bengaluru bachelor tenant: అద్దె ఇల్లు నరకంలా ఉంటుందని కొందరు అంటూ ఉంటారు. ఎందుకంటే ఇంటి ఓనర్ పెట్టే కండిషన్స్.. రూల్స్ తో కొందరు సతమతవుతుంటారు. అయితే నేటి కాలంలో ఇండివిజల్ ఇంటి కంటే అపార్ట్ మెంట్ లో ఉండాలని కోరుకుంటున్నారు. అయితే అపార్ట్ మెంట్ లోనూ ఇలాంటి కండిషన్స్ పెడుతున్నారని ఓ నెటిజన్ రెడిట్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. రాత్రి పూట అనుమతి లేకుండా ఇంటికి అమ్మాయిలు వచ్చారని, వారు వచ్చినందుకు ఇంటి ఓనర్ ఫైన్ వేశాడని అతడు తెలిపాడు. ఇంటికి అతిథులు రావొద్దా..? నేనిప్పుడు ఏం చేయాలి? చెప్పండి అని ఆయన నెటిజన్లకు ప్రశ్న వేశాడు. అయితే నెటిజన్లు ఎలాంటి సమాధానం ఇచ్చారో చూద్దాం..
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు ఐటీ ఎంప్లాయిస్ కు హబ్ గా పేర్కొంటారు. ఇక్కడ చాలా మంది అపార్ట్ మెంట్ లోనే ఉండాలని అనుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ యూత్ ఎక్కువగా ఉంటారు. ఉద్యోగం లేదా చదువు కోసం వచ్చి అపార్ట్ మెంట్ లో అద్దెకు తీసుకుంటూ ఉంటారు. అయితే అద్దెకు తీసుకునే వరకు పర్వాలేదు. కానీ బ్యాచిలర్స్ కు మాత్రం కొన్ని కండిషన్స్ పెట్టారు. బ్యాచిలర్స్ ఎవరైనా రాత్రి సమయంలో అతిథులను తీసుకురావొద్దనే కండిషన్ ఉంది. ఒకవేళ వస్తే.. వారికి నగదు రూపంలో జరినామా విధిస్తున్నారు.
ఓ యువకుడు ఇటీవల తన గర్ల్ ఫ్రెండ్స్ ను ఇంటికి ఆహ్వానించాడు. వీరు ఓ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ విషయం అపార్ట్ మెంట్ సొసైటీకి తెలిసింది. దీంతో అద్దెకు తీసుకున్న వ్యక్తికి సొసైటీ రూ. 5 వేల ఫైన్ విధించింది. మా అపార్ట్ మెంట్ లో రాత్రి సమయంలో బ్యాచిలర్లు అతిథులను పిలవవద్దని, అలా పిలిస్తే ఇలా జరిమానా వేస్తుంటామని సొసైటీ ప్రతినిధి తెలిపారు. అయితే పెళ్లయిన వారికి మాత్రం ఈ రూల్స్ వర్తించదు అని తెలిపారు. దీంతో ఆ వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.అంతేకాకుండా ఈ సందర్భం మీకు ఎదురైతే మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్? అని కొశ్చెన్ చేశాడు.
దీంతో కొందరు నెటిజన్లు యువకుడికి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చారు. మీరు వెంటనే ఆ అపార్ట్ మెంట్ ను ఖాళీ చేసి వెళ్లండి.. అని సలహా ఇచ్చారు. ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటున్న ఇంట్లో బ్యాచిలర్స్ ఇలా రాత్రంతా అమ్మాయిలతో ఉండడం మిగతా వారికి ఇబ్బందికరమే అని మరొకరు అన్నారు. ఇంకొందరు మాత్రం స్వేచ్ఛకు కొందరు అడ్డు వస్తుంటారని.. తట్టుకోవాలని సలహా ఇచ్చారు.