KCR Strategy: కేసీఆర్ సైలెన్స్.. వెనుక వైలెన్స్ వ్యూహం!

KCR Strategy: నిశ్శబ్ధం ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. దాని వెనుక అంతకంటే రెట్టింపు వైలెన్స్ ఉంటుంది. అడవిలో పులి సైలెంట్ గా ఉంది అంటే.. వేటకు సిద్ధం అవుతోంది అర్థం. తర్వాత ఏదో ఒక ప్రాణి దానికి ఆహారం అవ్వాల్సిందే. ఇక రాజకీయాల్లో నేతలు సైలెన్స్ అయ్యారంటే.. దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ్యూహాత్మక మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆయన ఏమీ మాట్లాడటం లేదు. మాటల యుద్ధం […]

Written By: Raj Shekar, Updated On : April 22, 2023 12:55 pm
Follow us on

KCR Strategy

KCR Strategy: నిశ్శబ్ధం ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. దాని వెనుక అంతకంటే రెట్టింపు వైలెన్స్ ఉంటుంది. అడవిలో పులి సైలెంట్ గా ఉంది అంటే.. వేటకు సిద్ధం అవుతోంది అర్థం. తర్వాత ఏదో ఒక ప్రాణి దానికి ఆహారం అవ్వాల్సిందే. ఇక రాజకీయాల్లో నేతలు సైలెన్స్ అయ్యారంటే.. దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ్యూహాత్మక మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

కొన్నాళ్లుగా ఆయన ఏమీ మాట్లాడటం లేదు. మాటల యుద్ధం కూడా ఆపేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు వస్తే కనీసం ఆహ్వానం చెప్పకపోవడం యుద్ధంలో భాగం అనుకోవాలి తప్ప… మరే విధంంగానూ పోరాటం అనే కార్యాచరణ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీని పల్లెత్తు మాట అనడం లేదు. అనాల్సి వచ్చినా ఆయన మీడియా కెమెరాలన్నిటినీ ఆఫ్ చేయించి అంటున్నారు. రికార్డెడ్ గా అనడానికి మాత్రం సందేహిస్తున్నారు. దీంతో కేంద్రంపై పోరాటంలో కేసీఆర్ నిస్సహాయత చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

రౌండప్ చేస్తున్న బీజేపీ..
ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పేరు కూడా తెరపైకి తెస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నల్లో ప్రధానంగా కేసీఆర్ తో ఉన్న ఆర్థిక సంబంధాల గురించే వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తనను బీజేపీ రౌండప్ చేస్తోందని కేసిఆర్ కు అర్థమవుతూనే ఉంది. అయినా బీ ఆర్ ఎస్ అధినేత వ్యూహాత్మక మౌనం పాటిస్తూనే ఉన్నారు.

మహారాష్ట్ర దాటని బీఆర్ఎస్..
ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసిఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. తర్వాత భారీ ఖర్చు పెట్టి మీడియాలో ప్రకటనలు ఇచ్చుకున్నారు కానీ నేరుగా ఇతర రాష్ట్రాల్లో చేసిన రాజకీయమే లేదు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో రెండు సభలు పెట్టారు. మూడో సభ కూడా అక్కడే పెడుతున్నారు. బీఆర్ఎస్ మహారాష్ట్ర దాటడం లేదు. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత మొదటి టార్గెట్ కర్ణాటక అని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు మౌనం వహిస్తున్నారు.

లక్ష్యం గురి తప్పిందా..
కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీ నీ ఓడించి తొలి దెబ్బ కొట్టాలని కేసిఆర్ ప్లాన్ చేశారు. కానీ ఎన్నికల నోటిఫికేష్ వచ్చి.. నామినేషన్ల గడువు కూడా ముగిసింది. కానీ ఆయన ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రస్తావనే లేదు. కనీసం కుమారస్వామి పార్టీకి మద్దతు కూడా ప్రకటించలేదు. దీంతో కేసిఆర్ లక్ష్యం గురి తప్పోతోందా అన్న చర్చ మొదలైంది.

KCR Strategy

బీజేపీపై పోరాటానికి విపక్షాలు రెడీ..
లోక్ సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమే ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి విపక్షాలు రెడీ అవుతున్నాయి. వారందర్నీ కలపపడానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం వారిని కలిసేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు.

పరిస్థితి చూస్తూంటే కేసీఆర్ యుద్ధంలోకి దిగకుండానే ఓటమి ఒప్పుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం ఆయన మౌనం వల్ల వినిపిస్తోంది. మరి ఇదే అభిప్రాయం నిజం చేస్తారా.. లేక వ్యూహాత్మక మౌనం వెనుక బీజేపీ నీ దెబ్బకొట్టే ప్లాన్ తో ముందుకు వస్తారా.. వెయిట్ అండ్ సీ..!