https://oktelugu.com/

Alia Bhatt: అలియా భట్ ఇండియన్ కాదా? ఓటు వేసే హక్కు లేని ఆమె ఓటింగ్ క్యాంపైన్ ఎలా చేస్తుంది?

Alia Bhatt: అలియా భట్ సిటిజెన్ షిప్ పై పెద్ద వివాదం నడుస్తుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆమె ఓటు వేయలేనని స్వయం చెప్పారు. దాని కారణం ఆమె ఇండియన్ సిటిజన్షిప్ లేకపోవడమే. నిజానికి అలియాకు బ్రిటిష్ పాస్ పోర్ట్ ఉంది. ఆమె ఇంగ్లాండ్ సిటిజెన్ గా నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో ఆమె ఇండియాలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయలేరు. అయితే ఆమె డ్యూయల్ సిటిజెన్ షిప్ కోసం అప్లై చేశారట. ఇదే విషయాన్ని […]

Written By:
  • Shiva
  • , Updated On : April 22, 2023 1:05 pm
    Follow us on

    Alia Bhatt

    Alia Bhatt

    Alia Bhatt: అలియా భట్ సిటిజెన్ షిప్ పై పెద్ద వివాదం నడుస్తుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆమె ఓటు వేయలేనని స్వయం చెప్పారు. దాని కారణం ఆమె ఇండియన్ సిటిజన్షిప్ లేకపోవడమే. నిజానికి అలియాకు బ్రిటిష్ పాస్ పోర్ట్ ఉంది. ఆమె ఇంగ్లాండ్ సిటిజెన్ గా నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో ఆమె ఇండియాలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయలేరు. అయితే ఆమె డ్యూయల్ సిటిజెన్ షిప్ కోసం అప్లై చేశారట. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అలియా భట్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    ”దురదృష్టవశాత్తు నేను 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయలేను. కారణం నాకు బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో నేను ఓటు వేసేందుకు ప్రయత్నం చేస్తాను. అందుకు సంబంధించిన డాకుమెంట్స్ నేను సిద్ధం చేస్తున్నాను అన్నారు. డ్యూయల్ సిటిజెన్షిప్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇండియాలో డ్యూయల్ సిటిజెన్షిప్ కి అవకాశం లేదని తెలుస్తుంది. ఇండియాలో ఓటు లేని అలియా భట్ ఓటింగ్ క్యాంపైన్ చేయడమేంటని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

    ఈ క్రమంలో అలియా భట్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో చాలా కాలంగా అలియా భట్ నెగిటివిటీ ఎదుర్కొంటున్నారు. దర్శకుడు మహేష్ భట్ కూతురైన అలియా భట్ పెద్దల సప్పోర్ట్ తో పరిశ్రమలో రాణిస్తున్నారనే అపవాదు ఉంది. అలియా భట్ కి కనీసం ఇండియన్ సిటిజన్షిప్ లేదన్న వార్త ప్రకంపనలు రేపుతోంది. గతంలో ఇదే సమస్య అక్షయ్ కుమార్ ఎదుర్కొన్నారు. ఆయన్ని కెనడియన్ కుమార్ అంటూ ట్రోల్ చేశారు. కారణం ఆయనకు కెనడా పాస్ పోర్ట్ ఉంది.

    అక్షయ్ కుమార్ ఇండియన్ కాదంటూ గతంలో ట్రోల్ చేశారు. సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీనికి అక్షయ్ కుమార్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పాస్ పార్ట్ ఉన్నంత మాత్రాన నేను ఇండియన్ కాకుండా పోను. నేను నటించిన 15 చిత్రాలు వరుసగా పరాజయం అయినప్పుడు నేను కెనడియన్ పాస్ పోర్ట్ కోసం అప్లై చేశాను. అది 1990లో జరిగింది.

    Alia Bhatt

    Alia Bhatt

    నేను ఇండియాలోనే ఉన్నాను. ఇక్కడే చిత్రాలు చేస్తున్నాను. ఇండియాలోనే టాక్సులు చెల్లిస్తున్నాను. నన్ను ఇండియన్ కాదని కెనడియన్ అనడం అమానుషం అన్నారు. రన్బీర్ కపూర్ ని వివాహం చేసుకున్న అలియా భక్తి కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆమె కనీసం ఓటు హక్కు లేదు. ఆమె ఎలా ఓటింగ్ క్యాంపైన్ చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.