https://oktelugu.com/

టీడీపీ ఏపీ నూతన అధ్యక్షుడు అతడేనా?

ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు ప్రశ్న టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు అచ్చెన్నాయుడే టీడీపీ అధ్యక్షుడని ప్రచారం జరిగింది.కానీ మొన్నటి నియామకాల్లో చంద్రబాబు పూర్తిగా అచ్చెన్నను పక్కనపెట్టేశాడు.  దీంతో టీడీపీ ఏపీ కొత్త అధ్యక్షుడి కోసం వేట మొదలైందనే టాక్ నడుస్తోంది. Also Read: హైదరాబాద్ లో సెలబ్రిటీలకు షాక్.. వాట్సాప్ చాట్ హ్యాక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఆయువు పట్టుగా ఉన్న బీసీలంతా వైసీపీకి జైకొట్టారు. అందుకే చంద్రబాబు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2020 3:33 pm
    Follow us on


    ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు ప్రశ్న టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు అచ్చెన్నాయుడే టీడీపీ అధ్యక్షుడని ప్రచారం జరిగింది.కానీ మొన్నటి నియామకాల్లో చంద్రబాబు పూర్తిగా అచ్చెన్నను పక్కనపెట్టేశాడు.  దీంతో టీడీపీ ఏపీ కొత్త అధ్యక్షుడి కోసం వేట మొదలైందనే టాక్ నడుస్తోంది.

    Also Read: హైదరాబాద్ లో సెలబ్రిటీలకు షాక్.. వాట్సాప్ చాట్ హ్యాక్

    గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఆయువు పట్టుగా ఉన్న బీసీలంతా వైసీపీకి జైకొట్టారు. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈసారి పదవుల్లో బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. కమ్మ, కాపు, రెడ్డి సామాజికవర్గాలకు పదవుల పందేరం చేయడం లేదు.

    ఇక చంద్రబాబు, లోకేష్ లకు నమ్మినబంటుగా.. రెబలిజం లేని నేత కోసం ప్రస్తుతం వెతుకుతున్నారట.. ఈ క్రమంలోనే ప్రస్తుత ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్రయాదవ్ పేరు ఇప్పుడు టీడీపీ అధ్యక్ష బరిలో వినిపిస్తోంది. ఆయనే అధ్యక్ష బాధ్యతలను చంద్రబాబు అప్పగించే యోచనలో ఉన్నారట చంద్రబాబు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీదకు వేరే బాధ్యతలు ఏవీ అప్పగించకపోవడానికి కారణం ఇదేనని టీడీపీలో చర్చ జరుగుతోంది.

    Also Read: అగ్రి గోల్డ్ బాధితులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

    ఇప్పటికే బీద రవిచంద్రయాదవ్ టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడిగా రెండు దఫాలు చేశాడు. లోకేష్ కు అణిగిమణిగి ఉంటూ ఆయన మనసు దోచుకున్నాడట.. ఎమ్మెల్సీగా లోకేష్ పక్కనే ఉంటూ సౌమ్యుడు, వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నాడట.. దీంతో లోకేష్ రికమండ్ మేరకు బీద రవిచంద్రనే కాబోయే టీడీపీ ఏపీ అధ్యక్షుడన్న ప్రచారం టీడీపీలో జోరుగా సాగుతోంది. మరి ఇది ఏమవుతుందనేది వేచిచూడాలి.