భారీ విరాళం ప్రకటించిన గంగూలీ!

భారతదేశాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ పై పోరుకు దేశం మొత్తం ఏకమైంది. సామాన్యులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, కంపెనీలు.. ఇలా అందరూ తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. విపత్కర సమయంలో ఏకతాటిపైకి వచ్చి కరోనా మహమ్మారిపై యుద్ధానికి ముందుకొచ్చారు. ఇక, తాజా, మాజీ క్రికెటర్లు అయితే ఈ విషయంలో చాలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ మేమున్నామని హామీ ఇచ్చిన గంగూలీ ఈ రోజు భారత క్రికెట్ నియంత్రణ మండలి […]

Written By: Neelambaram, Updated On : March 30, 2020 7:00 pm
Follow us on


భారతదేశాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ పై పోరుకు దేశం మొత్తం ఏకమైంది. సామాన్యులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, కంపెనీలు.. ఇలా అందరూ తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. విపత్కర సమయంలో ఏకతాటిపైకి వచ్చి కరోనా మహమ్మారిపై యుద్ధానికి ముందుకొచ్చారు. ఇక, తాజా, మాజీ క్రికెటర్లు అయితే ఈ విషయంలో చాలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ మేమున్నామని హామీ ఇచ్చిన గంగూలీ ఈ రోజు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తరుపున పీఎం కేర్స్ ఫండ్‌ కు రూ. 51 కోట్ల విరాళం ప్రకటించారు.

అంతేకాకుండా తాను వ్యక్తి గతంగా మరో రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని విరాళంగా ఇచ్చాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించగా సురేశ్ రైనా రూ. 52 లక్షలు, అజింక్య రహానే రూ. 10 లక్షల సాయం ప్రకటించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా తన వంతు సాయం అందిస్తానని ముందుకొచ్చాడు. భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తన ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. 16 ఏళ్ల మహిళా క్రికెటర్ రిచా ఘోష్ లక్ష రూపాయలు ఇచ్చింది. బెంగాల్, ముంబై, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించాయి.