https://oktelugu.com/

బాబుకు సైతం ఆ నేతలు దొరకడం లేదుగా?

టీడీపీ హయాంలో అధికార దర్పాన్ని ప్రదర్శించి నేతలంతా ఇప్పుడు సైలంటయ్యారు. ప్రధానంగా చంద్రబాబు క్యాబినెట్లో స్థానం సంపాదించుకున్న నేతలు ఇప్పుడు పత్తాకు కూడా కన్పించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. 175సీట్లలో పోటీచేసి కేవలం 23సీట్లు సాధించింది. వైసీసీ ఫ్యాన్ గాలి ఏపీలో జోరుగా వీయడంతో 151సీట్ల బంపర్ మెజార్టీతో ఆపార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. తొలి నుంచి దూకుడు స్వభావం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 14, 2020 / 08:42 PM IST
    Follow us on


    టీడీపీ హయాంలో అధికార దర్పాన్ని ప్రదర్శించి నేతలంతా ఇప్పుడు సైలంటయ్యారు. ప్రధానంగా చంద్రబాబు క్యాబినెట్లో స్థానం సంపాదించుకున్న నేతలు ఇప్పుడు పత్తాకు కూడా కన్పించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. 175సీట్లలో పోటీచేసి కేవలం 23సీట్లు సాధించింది. వైసీసీ ఫ్యాన్ గాలి ఏపీలో జోరుగా వీయడంతో 151సీట్ల బంపర్ మెజార్టీతో ఆపార్టీ అధికారంలోకి వచ్చింది.

    సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. తొలి నుంచి దూకుడు స్వభావం కలిగిన జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఒకవైపు ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూనే ప్రజల మన్నలను పొందుతూనే మరోవైపు టీడీపీని టార్గెట్ చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో జరిగిన స్కాములను బయటికితీసి టీడీపీ నేతలకు జైళ్లకు పంపుతున్నారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

    చంద్రబాబు బినామీ… టీడీపీకి గుడ్ బై చెవుతున్నాడా?

    ప్రధానంగా టీడీపీ హయాంలో మంత్రులుగా చేసిన నేతలంతా ప్రస్తుతం సైలంటవడం చర్చనీయాంశంగా మారింది. కనీసం చంద్రబాబు, లోకేష్ లకు కూడా అందుబాటులోకి రావడంలేదనే టాక్ విన్పిస్తుంది. మీడియా ఎక్కువగా ఫోకస్ అయితే తమ పరిస్థితి కూడా అచ్చెన్నాయుడిలా మారుతుందని ఆందోళన చెందుతున్నారట. దీంతోపాటు టీడీపీలో లోకేష్ పెత్తనం నచ్చక నేతలంతా సైలంట్ అయినట్లు తెలుస్తోంది.

    టీడీపీ ప్రభుత్వంలో యాక్టివ్ గా వ్యవహరించిన పరిటాల కుటుంబం పూర్తిగా మౌనం దాల్చింది. చిత్తూరులో అమర్ నాథ్ రెడ్డి, నెల్లూరులో నారాయణ సైలంటయ్యారు. ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరే గంట శ్రీనివాసరావు ఇంక గంటకొట్టడం లేదు. కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ, గుంటూరులో ఒకరిద్దరు నేతలు తప్ప ఎవరూ యాక్టివ్ గా కన్పించడం లేదని టీడీపీ వర్గాల్లో టాక్ విన్పిస్తుంది.

    మరోవైపు జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తుండటంతో ఆ పార్టీ నేతలు ప్రస్తుతం స్తబ్ధుగా ఉంటున్నారు. టీడీపీ హయంలోని స్కాములన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ నేతలంతా జైళ్లకు వెళుతుండటంతో ఇప్పుడు మౌనంగా ఉండటమో బెటరని ఆలోచిస్తున్నారట. ఎన్నికల ముందువరకు యాక్టివ్ కావచ్చని టీడీపీ నేతలు చంద్రబాబుకే చెబుతున్నారట. మరికొందరేమో తమ వ్యాపారాలు, ఆర్థిక అవసరాల కోసం టీడీపీని వదిలి వైసీపీలో చేరుతున్నారు.

    ఇప్పటికైనా చంద్రబాబు ఇలాంటి నేతలను దూరంపెట్టి పార్టీ కోసం కష్టపడేవారికే పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. మరీ బాబు ఇలాంటి వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!