Homeజాతీయ వార్తలుBank Amalgamation: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన.. మే 1, 2025 నుంచి దేశావ్యాప్తంగా ఈ...

Bank Amalgamation: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన.. మే 1, 2025 నుంచి దేశావ్యాప్తంగా ఈ 15 బ్యాంకులు విలీనం..

Bank Amalgamation: ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, జమ్మూ మరియు కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా మరియు రాజస్థాన్ రాష్ట్రాలలో దీని ప్రభావం కనిపించనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మే ఒకటి నుంచి ఒక రాష్ట్రం ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు అనే విధానం అమలులోకి రానుంది. తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదన ప్రకారం 11 రాష్ట్రాలలో 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం కోసం ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణలో ఈ విలీనం నాలుగవ దశ అని తెలుస్తుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా రీజినల్ రూరల్ బ్యాంక్ ల సంఖ్య 43 నుండి 28కి తగ్గనుందని తెలుస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పాటు అనేక ప్రభుత్వ బ్యాంకులతో ఈ బ్యాంకులు అనుబంధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇవి గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలను మరింత బలోపేతం చేస్తాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దీని ప్రభావం మొత్తం దేశంలోని 11 రాష్ట్రాలలో కనిపించబోతుంది. ప్రస్తుతం ఈ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో ఒకే సంస్థగా త్వరలో విలీనం కానున్నాయి.ఈ విధంగా తాజాగా ప్రభుత్వం ఒక రాష్ట్రం ఒక రీజినల్ రూరల్ బ్యాంకు లక్ష్యాన్ని సాధించవచ్చు.

Also Read: టెస్లా వర్సెస్ చైనా.. సౌదీ ఎడారిలో యుద్ధం!

వీటి విలీనం కోసం మే 1, 2025 గా నిర్ణయించడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు స్పాన్సర్ చేసిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అలాగే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ విలీనం అయ్యి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గా మే 1 నుంచి ఏర్పడతాయి. అలాగే ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాలలోని మూడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఒకే సంస్థగా విలీనం కాబోతున్నాయి.

ఉత్తరప్రదేశ్లో ఉన్న బరోడా యూపీ బ్యాంకు, ఆర్య వర్క్ బ్యాంకు, ప్రథమ యుపి గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి ఉత్తరప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గా ఏర్పడనున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా సహకారంతో దీని ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంటుందని సమాచారం. అదేవిధంగా బంగీయ గ్రామీణ వికాస్ బ్యాంక్ మరియు పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్, ఉత్తర్భాంగ్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంకును పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేయనున్నారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version