https://oktelugu.com/

Bandla Ganesh: ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోతే నా అంత నీచుడు ఉండడు : బండ్ల గణేష్

నిజానికి రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు అనేవి చేయకూడదు ఎందుకంటే రాజకీయం అనేది వేరు పర్సనల్ ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ వేరుగా ఉంటుంది. కాబట్టి పర్సనల్ విమర్శలు అనేవి చేయకూడదు.

Written By:
  • Gopi
  • , Updated On : October 14, 2023 / 01:22 PM IST

    Bandla Ganesh

    Follow us on

    Bandla Ganesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు.ఈయన సినిమాల్లో స్టార్ హీరో గా ఉంటూనే సినిమాలను వదిలేసి జనసేన పార్టీ పెట్టీ రాజకీయాల్లోకి వెళ్లిన విషయం కూడా మనకు తెలిసిందే…ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ మీద చాలా మంది వ్యక్తులు విమర్శలు చేస్తూ ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే ఆయన మీద ఎలాంటి నేర పూరిత కేసులు లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఆయనని ఎలా విమర్శించాలో తెలియక ఎప్పుడు చూసినా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ విమర్శిస్తూ ఉంటారు.

    నిజానికి రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు అనేవి చేయకూడదు ఎందుకంటే రాజకీయం అనేది వేరు పర్సనల్ ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ వేరుగా ఉంటుంది. కాబట్టి పర్సనల్ విమర్శలు అనేవి చేయకూడదు. కానీ మళ్లీ ఆంద్ర ప్రదేశ్ సిఎం అయిన జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఈ దత్త పుత్రుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి వారేమో లోకల్, రెండవ భార్య ఏమో నేషనల్, మూడో భార్య ఏమో ఇంటర్నేషనల్ అంటూ మాట్లాడుతూనే ఇక నాలుగో భార్య మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అంటూ పవన్ కళ్యాణ్ మీద ఆయన పర్సనల్ జీవితం మీద విమర్శలు చేశాడు.

    దానిమీద బండ్ల గణేష్ స్పందిస్తూ ఒక వీడియో చేశాడు నాకు అత్యంత ఆప్తులు అయిన పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన జగన్ మోహన్ రెడ్డి పర్సనల్ వ్యాఖ్యలు చేయడం అనేది నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అంటూ ట్విట్టర్ లో ఒక వీడియోను వదిలాడు. ఆ వీడియో లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ ని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను.ఆయన వ్యక్తివం ఏంటో నాకు తెలుసు, ఎవరు ఆపదలో ఉన్న తను ఆపదలో ఉన్నట్టుగా భావించి వాళ్ళకి చేతనైన సాయం చేస్తాడు. అలాగే తను చాలా మందిని ఎంకరేజ్ చేసి సినిమా ఇండస్ట్రీలో వాళ్లకంటు ఒక మంచి లైఫ్ ని కూడా చూపించాడు. ఆయన సినిమాల్లో చాలా లగ్జరీ లైఫ్ ని అనుభవించుకుంటూ ఉండాల్సిన వ్యక్తి…కానీ ప్రజల శ్రేయస్సు కోరి రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ పోరాటం చేస్తున్నడే తప్ప ఆయన కి సినిమాల్లో కెరియర్ లేక కాదు.

    ఆయన సినిమా మీద వచ్చిన డబ్బుల్ని పార్టీ కోసం ఖర్చు పెడుతూ జనాలకు ఎంతో కొంత మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన రాజకీయ ఎజెండ మొదలు పెట్టాడు తప్ప అక్రమాలు చేయడానికి కాదు. ఆయన నిజంగా మంచి వ్యక్తిత్వం కల వ్యక్తి కాబట్టే ఆయనకు కుల పిచ్చి అనేది లేదు. ఆయనకు కుల పిచ్చి కనక ఉన్నట్టయితే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాన్ని కాదు.

    నన్ను మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తు నన్ను ఇండస్ట్రీ లో ప్రొడ్యూసర్ గా చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిదే ఇప్పుడు నేను ఇలా బతుకుతున్నాను అంటే అది పవన్ కళ్యాణ్ పెట్టిన బిక్షే అంటూ చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. మీరు అలాంటి మనిషి మీద ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదు. అంటూ జగన్ మోహన్ రెడ్డికి ఆ వీడియో ద్వారా తెలియజేశాడు ఇక ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నా అంత నీచుడు ఉండడు అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను అంటూ ఆ వీడియోలో చెప్పడం జరిగింది…ఇక ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ గా మారింది…చాలా రోజుల తర్వాత బండ్ల గణేష్ ఇలా మాట్లాడటం చూసిన పవన్ అభిమానులు మాత్రం బండ్ల గణేష్ ని పొగుడుతూ నువ్వు తోపు అన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక మరి కొందరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అంటే ఎవరైనా అది నీ తర్వాతే అన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు…