
MAA Elections: మూవీ అసోసియేషన్ ఆఫ్ ఆర్టిస్ట్స్ (మా) ఎన్నికల్లో వరుసగా సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం నుంచి 8 గంటల నుంచి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో అటు మంచు విష్ణు ప్యానల్, ఇటు ప్రకాశ్ రాజ్ ప్యానల్ తమ ప్రచారం ముమ్మరం చేశారు. తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మా ఎన్నికల(MAA Elections) వేళ కొన్ని ట్విస్టులు నమోదవుతున్నాయి.
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు. తన నోటి దురుసుతో పొంతన లేని వ్యాఖ్యలు చేస్తూ అందరిని గందరగోళానికి గురి చేస్తున్నాడు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్లకు రెండింటికి ప్రచారం చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ప్రచారంలో ఎటో ఒక వైపు ఉండకుండా తన కోపాన్ని ప్రదర్శిస్తూ అందరిని అయోమయానికి గురయ్యేలా చేస్తున్నాడు. దీంతో ఆయన ఎటు వైపు ఉన్నారో అనే సందేహం అందరిలో కలుగుతోంది. జీవితపై ఉన్న కోపంతోనే తన కసి ఇలా తీర్చుకుంటున్నాడని చెబుతున్నారు. మరోవైపు జీవిత ఫొటోలను మార్కు చేసి తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాడు.
ముందుగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన బండ్ల గణేష్ జీవిత రావడంతో తప్పుకున్నాడు. తరువాత స్వతంత్రంగా బరిలో దిగిన అతడు నామినేషన్ అనంతరం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక ఈ రోజు ఎన్నికలు జరిగే సమయానికి ట్విటర్ లో మంచు విష్ణు ప్యానల్ అభ్యర్థి రఘుబాబును గెలిపించాలని కోరాడు. మరోమారు ప్రకాశ్ రాజ్ ప్యానల్ అభ్యర్థులను గెలిపించాలని సూచించి అందరిలో అయోమయం నెలకొనేలా చేస్తున్నాడు. అసలు బండ్ల గణేష్ ఎటు వైపు ఉన్నాడనేది ఎవరికి అంతుబట్టడం లేదు. వరుస ట్వీట్లతో అందరిని తప్పుదోవ పట్టిస్తున్నాడని మా సభ్యుల్లో ఆగ్రహం పెరుగుతోంది.
బండ్ల గణేస్ వ్యవహారం మా లో చర్చనీయాంశం అవుతోంది. మా సభ్యులను ఎటూ నిర్ణయించుకోకుండ చేస్తూ పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని అందరు విమర్శిస్తున్నారు. బండ్ల గణేష్ బాధ్యత గల వాడిగా ప్రవర్తించకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని అంటున్నారు. ఏదో ఒక వైపు ఉండి ప్రచారం చేయడంలో తప్పు లేదు కానీ ఇలా ఒకసారి వారికి మరోసారి వీరికి ఓటు వేయాలని చెప్పడం కొసమెరుపు.