Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో బీజేపీ దూకుడు పెంచింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అన్నట్లుగా ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సారథ్యంలో కమలనాథులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే కొన్ని నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులపైనా ఆ పార్టీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేసే నియోజకవర్గం కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది.

ముధోల్ నుంచి సంజయ్ పోటీ..
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడి నుంచి బరిలో దిగి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచాం. ప్రస్తుతం నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం నుంచే సంజయ్ ఐదో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఐదు రోజులు ఆ నియోజకవర్గంలోనే పాదయాత్ర చేశారు. శుక్రవారం రాత్రి నిర్మల్ నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించింది. అయితే ముధోల్ నియోజకవర్గంలో బండి యాత్రకు పార్టీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా నేతలు, స్థానికుల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముధోల్ నుంచి పోటీ చేయయాలని సంజయ్‌కి విన్నవించారు. అయితే ఈ రిక్వెస్టులను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే సంజయ్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
సెన్సిటివ్ సెగ్మెంట్
ముధోల్ నియోజకవర్గం సెన్సెటివ్ ప్రాంతం. ఇక్కడ మత ఘర్షణలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ సుమారు 2 లక్షల కంటే ఎక్కువే ఓటర్లున్నారు. అయితే ఇందులో బండి సంజయ్ సామాజికవర్గమైన మున్నూరుకాపు ఓట్లు 50 వేల వరకు ఉన్నారు. ఇది కలిసి వస్తుందని బీజేపీ నేతలు సంజయ్‌కి సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఇక్కడ సంజయ్ గెలిస్తే స్థానిక హిందువులకు భరోసా కలుగుతుందని, ముస్లింలలో భయం పుడుతుందని, దాడులకు వెనుకాడుతార భావిస్తున్నారు. అంతేకాకుండా అల్లర్ల బాధితులకు అండగా ఉంటామని ఇప్పటికే బండి ప్రకటించారు. కేసులను తొలగించి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ఇది ప్లస్ అవుతుందని బీజేపీ నాయకత్వం కూడా భావిస్తున్నట్లు సమాచారం.

ప్రత్యామ్నాయం లేకే..
ముధోల్ నియోజకవర్గంలో బీజేపీకి గట్టి లీడర్ లేరు. డీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామారావు పటేల్ వారం క్రితమే బీజేపీలో చేరారు. ఆయనకు కూడా ఇక్కడ పట్టు ఉంది. వచ్చే ఎన్నిల్లో బీజేపీ తరఫున పోటీ చేసేందుకే ఆయన కాషాయ కండువా కకప్పుకున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఉన్నారు. సిట్టింగులకే టికెట్ ఇస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. 2014లో కాంగ్రెస్ తరపున, 2018లో టీఆర్‌ఎస్ తరపున విఠల్‌రెడ్డి గెలిచారు. కానీ నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని లోకల్ లీడర్లు చెబుతున్నారు. ఈనేపథ్యంలో బండి సంజయ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు. అయితే బండి సంజయ్ పోటీకి సై అంటే రామారావ్ పటేల్‌ను ప్రత్యామ్నాయం చూడాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మరి సంజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.