Homeజాతీయ వార్తలుBandi Sanjay Sensational Comments: సీఎం కుర్చీ వద్దు.. నన్ను చంపేందుకు రెక్కీ చేస్తున్నారు.. సంజయ్...

Bandi Sanjay Sensational Comments: సీఎం కుర్చీ వద్దు.. నన్ను చంపేందుకు రెక్కీ చేస్తున్నారు.. సంజయ్ సంచలన కామెంట్స్

Bandi Sanjay Sensational Comments: ప్రస్తుతం తెలంగాణలో బండి సంజయ్ హవా ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. అయితే బీజేపీ గెలిస్తే ఆయన సీఎం అవుతారనే వార్తలు మొన్నటి వరకు బలంగా వినిపించాయి. ఈ వార్తలపై తాజాగా బండి సంజయ్ స్పందించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సీఎంను అస్సలు కాబోనని తేల్చి చెప్పారు. తెలంగాణకు బీజేపీ అభ్యర్థి సీఎం చేయడమే తన లక్ష్యమని, తాను సీఎం రేసులో లేను అంటూ స్పష్టం చేశారు.

దీంతో మొన్నటి వరకు వినిపించిన వార్తలన్నీ పుకార్లే అని తేలి పోయింది. కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం కుదరదని.. ఆయన్ను ఎవరూ పట్టించుకోరు అంటూ ఎద్దేవా చేశారు. కొన్ని రైతు సంఘాలను కలుస్తూ దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని, రైతు ఉద్యమంలో తాను జాతీయ నాయకుడు అని కెసిఆర్ నిరూపించుకోవాలని చూస్తున్నారన్నారు బండి సంజయ్.

Bandi Sanjay Sensational Comments
Bandi Sanjay

తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమే అంటూ తేల్చిచెప్పారు సంజయ్. తనను ఎంపీగా గెలిపించడానికి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కారణమయ్యాయన్నారు. హిందూ గ్ బొందుగాల్లు అంటూ చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ మీద వ్యతిరేకత తీసుకు వచ్చాయని, తనను ఎంపీగా గెలిపించాయని వివరించారు.

Also Read: Janasena sabha: రాష్ట్ర రాజకీయాల దశదిశ మార్చే సభగా ఆవిర్భావ సభ

తాను అధ్యక్షుడు అయిన తర్వాత తనపై హత్యకు కుట్రలు జరుగుతున్నాయని పెను బాంబు పేల్చారు. కరీంనగర్ లో తన ఇంటి చుట్టూ కొన్ని టీమ్స్ రెక్కీ నిర్వహించాయని చెప్పుకొచ్చారు. ఓ వ్యక్తి లెదర్ బ్యాగ్ అమ్ముతున్నట్లు నటిస్తూ తన ఇంటి చుట్టూ నెలరోజులపాటు తిరిగాడని సంచలన ఆరోపణలు చేశారు. అయితే తాను యువమోర్చాలో ఉన్నప్పుడే తన మీద హత్యకు కుట్ర జరిగిందని.. అప్పటి నుంచే ఇలాంటివి అలవాటు అయ్యాయని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదని సంజయ్ తెలిపారు. కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయమేనని మరోసారి బాంబు పేల్చారు.

బండి సంజయ్ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అయితే బండి సంజయ్ సీఎం కాకపోతే మరి ఇంకా ఎవరికి ఛాన్స్ ఉంటుందనే వార్తలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. బండి సంజయ్ పోటీలో లేకపోతే ఇతరులకు పెద్ద అవకాశం దొరికినట్లే అవుతుంది. మరి మిగతా నేతల అభిప్రాయం ఏంటో తెలియాల్సి ఉంది.

Also Read: Early Elections In Telangana: తెలంగాణలో ఎన్నికల సంగ్రామం షురూ కానుందా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular