Homeజాతీయ వార్తలుBandi Sanjay Prajasangram Yatra: భైంసా మాదే.. నిర్మల్‌ మాదే.. తగ్గేదెలే.. బండి సంజయ్‌ ప్లాన్‌...

Bandi Sanjay Prajasangram Yatra: భైంసా మాదే.. నిర్మల్‌ మాదే.. తగ్గేదెలే.. బండి సంజయ్‌ ప్లాన్‌ ఇదే!!

Bandi Sanjay Prajasangram Yatra: తెలంగాణ కాశ్మీరంగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకవైపు చలి వణికిస్తుంటే.. రాజకీయాలు మాత్రం గరం గరంగా సాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ తన ఐదో విడత ప్రజాసంగ్రామయాత్రను నిర్మల్‌ జిల్లా భైంసా నుంచే ప్రారంభించారు. గత నాలుగు విడతలకు భిన్నంగా.. ప్రస్తుతం ప్రజా‘సంగ్రామ’ం సాగుతోంది. బండి యాత్రకు అడుగడుగునా భైంసా, నిర్మల్‌ ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ‘‘బండి’ స్పీడ్‌గా దూసుకుపోతోంది. సంజయ్‌ ప్రసంగం కూడా భిన్నంగా ఉంటోంది.

Bandi Sanjay Prajasangram Yatra
Bandi Sanjay

అడ్డుకునే కుట్రను ఛేదించి..
నిర్మల్‌ జిల్లా భైంసా నుంచి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర చేపడతామని బీజేపీ మునుగోడు ఎన్నికలకు ముందే ప్రకటించింది. ఈమేరకు రూట్‌మ్యాప్‌ కూడా సిద్ధం చేసింది. ఇంతలో మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో యాత్రను వాయిదా వేశారు. నవంబర్‌ 28 ప్రారంభించేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నారు. ఈమేరకు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో 27 రాత్రి అనుమతి నిరాకరిస్తూ ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశారు. దీంతో కమలనాథుల్లో టెన్షన్‌ నెలకొంది. రాత్రే పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. 28న ఉదయం హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. అదేరోజు సాయంత్రం అడెల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్ర ప్రారంభించారు. సభ మాత్రం 29న నిర్వహించారు. యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన కుట్రను ఛేదించుకుని సంగ్రామం చేపట్టిన ‘బండి’కి భైంసా బ్రహ్మరథం పట్టింది. 3 వేల మందితో మాత్రమే సభ నిర్వహించాలని కోర్టు షరతు విధించిన 30 వేల మందికిపైగా ప్రజలు తరలివచ్చి.. బండి యాత్రకు ఊపునిచ్చారు.

ఎక్కడా తగ్గని స్పీడు..
ఆరు రోజులుగా నిర్మల్‌ జిల్లాలో సాగుతున్న ప్రజాసంగ్రామయాత్రలో బండి సంజయ్‌ ఎక్కడా స్పీడు తగ్గడం లేదు. జనమే ‘బండి’ని నడిపిస్తున్నట్లుగా యాత్ర సాగుతోంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సంజయ్‌ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నినకల్లో భైంసా నుంచే పోటీ చేయాలని స్థానిక నేతల నుంచి బీజేపీ చీఫ్‌కు విన్నపాలు అందాయి. 50 వేల మెజారిటీతో గెలిపిస్తామని భరోసా కూడా ఇచ్చారు. ఇక సంజయ్‌ సంగ్రామం షురూ.. తోనే కేసీఆర్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. భైంసాకు అండగా ఉంటామని, అధికారంలోకి రాగానే దత్తత తీసుకుంటామని హిందువులై దాడిచేసిన వారిని వదిలి పెట్టమని స్పష్టం చేశారు. భైంసా పేరును మైపాగా మారుస్తామని తెలిపారు. దీంతో ‘మేమూ మీ వెంటే ఉంటాం’ అన్నట్లుగా బండి పాదయాత్రలో భైంసా మొత్తం నడిచింది. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి చేతగాని తనాన్ని ప్రశ్నిస్తూ.. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ.. అవినీతిని ఎండగడుతూ ‘బండి’ దూసుకుపోతోంది.

Bandi Sanjay Prajasangram Yatra
Bandi Sanjay

‘బండి’తో భరోసా..
ముధోల్‌ నియోజకవర్గంలో దిలావర్‌పూర్‌లో బండి నిర్వహించిన సభకు స్థానిక దళితులు భారీగా తరలివచ్చారు. నాలుగు నెలల క్రితం ఇక్కడ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత మహిళలు మంత్రిని తమకు దళితబంధు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన మంత్ర ‘టీఆర్‌ఎస్‌ నేతలకు ముందు ఇస్తాం.. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి’ అంటూ మహిళలు, దళితులు అని కూడా చూడకుండా అవమానించారు. మంత్రి తీరుకు నిరసనగా మరుసటి రోజు దళిత సంఘాలు నిర్మల్‌లో నిరసన తెలిపాయి. ఇందులో బాధిత మహిళలు పాల్గొన్నారు. దీంతో మరింత ఆగ్రహించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దళిత మహిళలను అరెస్టు చేయించి కేసు పెట్టించారు. ఈ నేపథ్యంలో బండి శనివారం దిలావర్‌పూర్‌కు రాగానే దళితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ దళిత మహిళలపై కేసు పెట్టిన మంత్రిని అధికారంలోకి వచ్చాక జైల్లో పెడతామని హెచ్చరించారు.
నిర్మల్‌ నీరా‘జనం’
ఆదివారం నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చేరుకున్న బండికి స్థానిక జనం బ్రహ్మరథం పట్టారు. రాత్రి నిర్వహించిన సభకు పట్టణంతోపాటు మండలం నుంచి జనం తండోప తండాలుగా తరలి వచ్చారు. కమలనాథులు ఊహించని రీతిలో వచ్చిన జన ప్రవాహాన్ని చూసిన సంజయ్‌ రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడారు. ‘‘బొట్టు పెట్టుకున్నోళ్లంతా హిందువులు కాదు.. అవినీతి మంత్రిని తరిమి కొడతాం.. మున్సిపల్‌ ఉద్యోగాలు ఇస్తామని లక్షలు వసూలు చేసిన మంత్రి జనవరి 10 వరకు తిరిగి ఇవ్వాలి లేకుంటే తడాకా చూపిస్తాం.. కొయ్య బొమ్మల కేంద్రాన్ని కబ్జాలకు కేరాఫ్‌గా మార్చిన మంత్రిపైకి బుల్డోజర్లు తీసుకొస్తాం.. పేదల ఇళ్లు కూల్చుతున్న కలెక్టర్‌కు పెద్దల ఆక్రమణలు కనిపించచడం లేదా..’’ అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని, నిర్మల్, భైంసాలో కాషాయ జెండా ఎగురుతుందని సంజయ్‌ ప్రయటించడంతో జనం చప్పట్లతో భైంసా, నిర్మల్‌లో బీజేపీని గెలిపిస్తాం అన్నట్లు మద్దతు ప్రకటించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version